ఓదెల 2 మూవీలో తమన్నా క్యారెక్టర్‌‌‌‌ లుక్‌‌ రివీల్

ఓదెల 2 మూవీలో తమన్నా క్యారెక్టర్‌‌‌‌ లుక్‌‌ రివీల్

తమన్నా లీడ్‌‌ రోల్‌‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఓదెల 2’. సంపత్ నంది క్రియేటర్‌‌‌‌గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి అశోక్ తేజ దర్శకుడు. ‘ఓదెల రైల్వేస్టేషన్‌‌’ చిత్రానికి ఇది సీక్వెల్.  ఇటీవలే కాశీలో ఈ చిత్రాన్ని ప్రారంభించారు. మహాశివరాత్రి సందర్భంగా తమన్నా క్యారెక్టర్‌‌‌‌ లుక్‌‌ను రివీల్ చేశారు. 

నుదుటిపై పసుపు, కుంకుమ బొట్లు, ఒక చేతిలో దండం, మరో చేతిలో ఢమ రుకంతో వారణాసిలోని ఘాట్‌‌పై నాగ సాధువు గెటప్‌‌లో కనిపిస్తోం ది తమన్నా. ఇందులో ఆమె ‘శివ శక్తి’ అనే పాత్రను పోషిస్తోంది. ఓదెల మల్లన్న స్వామి నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. హెబ్బా పటేల్, వశిష్ట ఎన్ సింహా ఇతరపాత్రలు పోషిస్తున్నారు. ‘కాంతార’ ఫేమ్ అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందిస్తున్నారు. మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌‌ వర్క్స్ బ్యానర్‌‌లపై డి మధు నిర్మిస్తున్నారు.