రజినీ 'జైలర్' లో తమన్నా మాస్ స్టెప్పులు

రజినీ 'జైలర్' లో తమన్నా మాస్ స్టెప్పులు

రజినీకాంత్(Rajinikanth) స్టైల్, స్టామినా పూర్తీ డిఫరెంట్. తాజాగా నెల్సన్ దిలీప్ కుమార్(Nelson Dilipkumar)  డైరెక్షన్ లో వస్తున్న మూవీ 'జైలర్'. రజినీకు జోడీగా తమన్నా(Tamannaah)  నటిస్తోంది. తాజాగా ఈ మూవీ నుంచి మేకర్స్ అప్డేట్ ఇచ్చారు. ఇవాళ( జూలై 7) న సాయంత్రం 6PM కు ఫస్ట్ సింగిల్ రాబోతున్నట్లు ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. తమన్నా హాట్ లుక్ తో ఉన్న ఈ పోస్టర్ ఫ్యాన్స్ ను ఫిదా చేస్తుంది. అనిరుధ్ మ్యూజిక్ అందిస్తుండటంతో ఈ ఫస్ట్ సింగిల్ కోసం  ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. 

రజినీ కాంత్ నుంచి వచ్చే ప్రతి మాస్ సాంగ్ లో తనదైన మాస్ స్టైల్ లో స్టెప్పులు వేస్తారు. మేనరిజంను చూపించడంలో రజినీ స్టైలే వేరు. ప్రస్తుతం రిలీజ్ చేసిన పోస్టర్ లో తమన్నా మాత్రమే కనిపించడంతో కుర్రకారును అట్ట్రాక్ట్ చేయటానికి మేకర్స్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. 

ఈ మధ్య తమన్నా నుంచి వచ్చిన సినిమాల్లో ఎక్కువగా బోల్డ్ కంటెంట్స్ సీన్స్ లో నటించడంతో.. యూనిట్ తమన్నాపై ఫోకస్ చేసినట్లు సమాచారం.  రజినీ తెర పై చూసేందుకు అభిమానులు ఎగబడుతుంటారు. ఇక ఈ సాంగ్ కనుక మెప్పిస్తే యూత్ థియేటర్లో ఎగబడటం ఖాయం అనిపిస్తోంది. 

ఈ మూవీలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్(Shivarajkumar), మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్(Mohanlal)  ముఖ్య పాత్రలో కనిపించబోతున్నారు. అలాగే  రమ్యకృష్ణ(Ramya Krishna), సునీల్(Sunil), జాకీ ష్రాఫ్(Jackie Shroff), యోగిబాబు(Yogi Babu) తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. కళానిధి మారన్ ఈ మూవీను నిర్మిస్తున్నారు. ఆగస్టు 10న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.