మరోసారి మత్తెక్కించినా తమన్నా..స్టేజ్‌పై కావాలాయ్య సాంగ్ కు అద్దిరిపోయే డ్యాన్స్

మరోసారి మత్తెక్కించినా తమన్నా..స్టేజ్‌పై కావాలాయ్య సాంగ్ కు అద్దిరిపోయే డ్యాన్స్

సూపర్ రజినీకాంత్(Rajinikanth) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ జైలర్(Jailer). నెల్సన్ కుమార్(Nelsan kumar) దర్శకతం వహిస్తున్న ఈ సినిమా ఆగస్టు 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. లేటెస్ట్ గా జైలర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ట్రేండింగ్ సాంగ్ అయినా.. కావాలాయ్య సాంగ్ కు (Kaavaalaa) తమన్నా(Thamannaah)  స్టేజి షో తో కుర్రాళ్లకు మత్తెక్కిచ్చే డ్యాన్స్ తో ఫిదా చేసింది. దీంతో మళ్ళీ తమన్నా ఫేమస్ అయింది. తన ఇన్‌స్టాగ్రామ్ లో ఆడియో లాంచ్ ఫొటోస్ షేర్ చేస్తూ.. కావాలా సాంగ్ కు నేను స్టేజి షో చేయడం ఎంతో హ్యాపీ.. ఈ సాంగ్ కు ఫిదా అయినా ఆడియన్స్ కు థాంక్స్. అలాగే ఆడియన్స్ లో ఒకరైన రజినీకాంత్ సార్ కు స్పెషల్ థాంక్స్ అంటూ.. తమన్నా పేర్కొన్నారు. ఈ సాంగ్ కు సోషల్ మీడియాలో  ఫ్యాన్స్  చేసిన వీడియోస్ కు గ్రేట్ రెస్పాన్స్ వచ్చింది. 

లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్(Anirudh) సంగీతం అందించిన ఈ పాట రికార్డ్స్ వ్యూస్ తో దూసుకుపోతోంది. ఈ పాటలో మిల్కీ బ్యూటీ తమన్నా వేసిన స్టెప్స్ ఐతే నెక్స్ట్ లెవల్ అనే చెప్పాలి. తన గ్లామర్ తో ఆడియన్స్ కు మత్తెక్కించింది ఈ బ్యూటీ. కేవలం తమన్నా అందాలు చూసేందుకే  ఈ సాంగ్ చూస్తున్నారు చాలా మంది. 

కెరీర్ మొదలైనప్పటి నుండి తమన్నా ఈ రేంజ్ లో అందాల విందు చేయడం ఇదే మొదటిసారి. దీంతో ఈ సాంగ్  ను కుర్రాళ్ళు ఎగబడి మరీ చూస్తున్నారు. కేవలం సాంగ్ లోనే ఈ రేంజ్ లో అందాలు ఆరబోసిందంటే.. మరి సినిమాలో ఏ రేంజ్ లో ఉండనుంది అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. ఈ మూవీ ఆగస్టు 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.  
 

So overwhelmed to have performed in front of the amazing fans who have loved #Kaavaalaa all the way! ???

And what made it even more special was to have @rajinikanth sir in the audience… Ahh goosebumps! ? pic.twitter.com/BViqBRZrwt

— Tamannaah Bhatia (@tamannaahspeaks) July 29, 2023