
మిల్కీబ్యూటీ తమన్నా(Tamannaah) తన గ్లామర్ సీక్రెట్స్ రివీల్ చేసింది. అందంగా ఉండటం అంటే గ్లామర్‌గా ఉండటం మాత్రమే కాదని ఫిట్నెస్ కూడా ఉండాలని తెలిపింది. ఈ రెండూ బ్యాలెన్స్ చేసుకోవడం వల్లే ఫిట్‌గా ఉన్నట్టు వివరించింది. ఇక తన డైట్ గురించి చెప్తూ.. ‘రోజులో 12 గంటలు ఏం తినకుండా ఉంటాను. మరో 12 గంటల్లో సాయంత్రం 6లోపే డిన్నర్ ముగించేస్తాను.
ఉదయం డ్రైఫ్రూట్స్, అరటిపండ్లు, ఖర్జూరం వంటివి బ్రేక్‌ఫాస్ట్‌లో ఉండాల్సిందే. మధ్యాహ్నం బ్రౌన్ రైస్, పప్పు, కూరగాయలతో సాత్విక భోజనం ఉండేలా చూసుకుంటాను. దీంతో పాటు ఉసిరిక జ్యూస్, గ్రీన్ టీ రెగ్యులర్‌గా తీసుకోవడం తన నిగారింపును కాపాడతాయి. ఇక జిమ్‌కి వెళ్లే విషయంలో అస్సలు బద్దకించను’ అని తమన్నా తెలిపింది. వర్కవుట్స్ వల్లే ఈ ఫిట్నెస్ సాధ్యమైందని వివరించింది.