ఇండస్ట్రీకి వచ్చి పదహారేళ్లవుతున్నా, ఇప్పటికీ వరుస సినిమాలతో దూసుకెళుతోంది తమన్నా. ఆల్రెడీ చిరంజీవి, వెంకటేష్ లాంటి స్టార్ హీరోలతో యాక్ట్ చేసిన ఆమె.. ఇప్పుడు సూపర్ స్టార్‌కి జంటగా కనిపించనుంది. రజినీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ‘జైలర్’ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో హీరోయిన్గా తమన్నాని సెలెక్ట్ చేశారట. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ మూవీ కోసం ఇప్పటికే ఐశ్వర్యారాయ్ పేరు వినిపించింది. అయితే ఇప్పుడు తమన్నా సెలెక్టయినట్లు తెలిసింది. రజినీకాంత్ నటిస్తున్న 169వ సినిమా ఇది.
ఆయన డ్యూయెల్ రోల్లో కనిపించనున్నారట. ఒక రజినీకాంత్‌కి జోడీగా రమ్యకృష్ణ కనిపిస్తారట. ఈ సినిమాలో మేజర్ పార్ట్ హైదరాబాద్‌లో తీయబోతున్నారు. దానికోసం భారీ సెట్‌ని సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం చెన్నైలో షూటింగ్ జరుగుతోంది. అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. మరోవైపు తమన్నా నటించిన గుర్తుందా శీతాకాలం, బబ్లీ బౌన్సర్, బోలె చూడియా, ప్లాన్ ఎ ప్లాన్ బి చిత్రాలు రిలీజ్‌కి రెడీగా ఉన్నాయి. ‘భోళా శంకర్’లో మెగాస్టార్‌తో మరోసారి కలిసి నటిస్తోంది.