
తమిళ బిగ్‌బాస్ ఫేమ్ వనిత విజయ్‌కుమార్ మళ్లీ తెలుగు ఆడియెన్స్‌ని ఎంటర్టైన్ చేయబోతోంది. ‘దేవి’ సినిమాతో తెలుగు ఆడియెన్స్‌కి తెలిసిన ఈమె కామెడీ షో ‘జబర్దస్త్’లో ఎంట్రీ ఇవ్వనుంది. తెలుగు కామెడీ షోలో ఆమె కనిపించడం ఇదే మొదటిసారి. జబర్దస్త్‌లో వనిత ఎంట్రీకి సంబంధించిన స్పెషల్ ఎపిసోడ్ టీజర్ రిలీజ్ చేసింది ఈటీవీ. ఇందులో ముగ్గురు చెల్లెళ్ల బాధ్యత చూసుకునే అక్కగా చేసింది. చెల్లెలి బాయ్‌ఫ్రెండ్ మీద వనిత వేసే సెటైర్లు నవ్విస్తాయి. ఈ ఎపిసోడ్లో తన జీవితంలోని విషయాల్ని ఆడియెన్స్‌తో షేర్ చేసుకుంటూ ఎమోషనల్ అయిందామె. ఏప్రిల్ 7వ తారీఖున ఈ స్పెషల్ ఎపిసోడ్ ఈటీవీలో టెలికాస్ట్ అవుతుంది. అనసూయ హోస్ట్‌గా చేస్తున్న ఈ ఎపిసోడ్‌కు మనో, ఇంద్రజ జడ్జీలు.