ప్రముఖ సినీ డైరెక్టర్  కె.వి.ఆనంద్ మృతి

ప్రముఖ సినీ డైరెక్టర్  కె.వి.ఆనంద్ మృతి

ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ K.V ఆనంద్‌(54) ఇవాళ(శుక్రవారం) ఉదయం చెన్నైలో చనిపోయారు. రాత్రి  ఛాతీలో తీవ్ర నొప్పి రావడంతో ఆయన స్వయంగా కారు నడుపుకుంటూ సమీపంలోని ఆస్పత్రికి వెళ్లారు.అయితే అక్కడే చిక్కిత్స పొందుతూ రాత్రి 3 గంటలకు మరణించారు.  ప్రేమ‌దేశం, ఒకేఒక్కడు, ర‌జినీకాంత్ 'శివాజీ' చిత్రాల‌కు సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేశారు. క‌ణా కండేన్ సినిమాతో ద‌ర్శకుడిగా మారారు. సూర్యతో వీడొక్కడే(అయాన్‌)తో సక్సెస్‌ సాధించిన ఆనంద్‌ ఆ తర్వాత జీవాతో రంగం(కో) తీశారు. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమా సూప‌ర్ హిట్ అయింది. త‌ర్వాత బ్రద‌ర్స్‌(మాట్రాన్‌), అనేకుడు(అనేగ‌న్‌), కవ‌న్‌, బందోబ‌స్త్‌(కాప్పాన్‌) చిత్రాల‌కు దర్శకత్వం వహించారు.

చెన్నైలో పుట్టిన పెరిగిన కె.వి.ఆనంద్ ఫ్రీ లాన్స్ ఫొటో జ‌ర్నలిస్ట్‌గా త‌న కెరీర్‌ను స్టార్ట్ చేశారు. 1994లో ఆయన ప్రియదర్శన్‌ మూవీ తెన్‌మావిన్‌ కొంబాత్‌ సినిమాతో సినిమాటోగ్రాఫర్‌గా సినీ ఇండస్ట్రీలోకి ఎంటరయ్యారు. ఆ సినిమాకు గాను ఆయనకు ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌గా జాతీయ అవార్డు లభించింది.