Nagarjuna, Naveen: నవీన్తో నాగార్జున.. వందవ సినిమా కోసం తమిళ్ డైరెక్టర్

Nagarjuna, Naveen: నవీన్తో నాగార్జున.. వందవ సినిమా కోసం తమిళ్ డైరెక్టర్

వంద సినిమాలు.. సినిమా ఇండస్ట్రీలో ఇది చాలా ప్రత్యేకం. అందుకే 100వ సినిమా చేసేందుకు చాలా మంది చాలా రకాల ప్లాన్స్ చేసుకుంటారు. ప్రత్యేకమైన ఈ సినిమా ఇంకా ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటారు. అందుకే ప్రతీ విషయంపై జాగ్రత్తలు తీసుకుంటారు. ప్రస్తుతం టాలీవుడ్ కింగ్ నాగార్జున(Nagarjuna)కు కూడా అదే పరిస్థితి వచ్చింది. ఇటీవలే సంక్రాంతి నా సామిరంగా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన.. మంచి విజయాన్ని అందుకున్నారు. గుంటూరు కారం, హనుమాన్, సైంధవ్ వంటి సినిమాల మధ్య వచ్చి సూపర్ కలెక్షన్స్ రాబట్టింది ఈ మూవీ.

ఇక ప్రస్తుతం ఆయన దర్శకుడు శేఖర్ కమ్ములతో కుబేర సినిమా చేస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో తమిళ స్టార్ ధనుష్ హీరోగా నటిస్తుండగా.. రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమాలో ఒక ప్రత్యేకమైన పాత్రలో నటిస్తున్నారు నాగార్జున. ఇక ఈ సినిమా తరువాతనే తన వందవ సినిమాను మొదలుపెట్టనున్నాడు నాగ్. అయితే తన కెరీర్ లో ప్రత్యేకమైన 100వ సినిమా కోసం తమిళ దర్శకుడు నవీన్ ను ఒకే చేశాడట. చాలా కాలం నుండి నవీన్ నాగార్జునతో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాడట. 

కానీ, నాగార్జునకి అప్పటికే ఉన్న కమిట్మెంట్స్ వల్ల నవీన్ సినిమా పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. ఇక తాజా సమాచారం మేరకు.. నాగార్జున కెరీర్ లో అత్యంత ప్రత్యేకమైన 100వ సినిమాకు డైరెక్ట్ చేసే అవకాశాన్ని దక్కించుకున్నారట నవీన్. త్వరలోనే అధికారిక ప్రకటన రానున్న ఈ సినిమాను కుబేర సినిమా కంప్లీట్ అయిన వెంటనే మొదలుపెట్టనున్నాడట నాగార్జున. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ విషయం తెలుసుకున్న నాగార్జున ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. మరి నమ్మకంగా తన వందవ సినిమా భాధ్యతను తనపై పెడుతున్న నాగార్జునకు నవీన్ ఎలాంటి సినిమా చేస్తాడా అనేది చూడాలి.