డైరెక్టర్ శంకర్ నిజమైన గేమ్ ఛేంజర్.. రామ్ చరణ్ ట్వీట్

డైరెక్టర్ శంకర్ నిజమైన గేమ్ ఛేంజర్.. రామ్ చరణ్ ట్వీట్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram charan) హీరోగా తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్(Shankar) దర్శకత్వంలో వస్తున్న లేటెస్ట్ మూవీ గేమ్ ఛేంజర్(Game changer). పాన్ ఇండియా రేంజ్లో వస్తున్న ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. డైరెక్టర్ శంకర్ సినీ రంగంలోకి ఎంట‌రై 30 ఏళ్లు పూర్త‌వుతోంది. 

లేటెస్ట్ గా రామ్ చరణ్ విషెస్ తెలియాజేస్తూ.. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ గా 30 ఇయర్స్ పూర్తి చేసుకున్నందుకు.. నిజమైన గేమ్ ఛేంజర్ అయినా డైరెక్టర్ శంకర్ కు విషెస్  తెలియజేశారు. మీ నుంచి రాబోతున్న వండర్ఫుల్ మూవీస్ కోసం నేను ఎదురుచూస్తున్న. మీ టెక్నిక్స్, మీ ఐడియాలజీ సూపర్..అంటూ చరణ్ ట్వీట్ చేయగా..  శంకర్ థ్యాంక్స్ చెపుతూ..ఆగస్టు లో మొదలయ్యే మన గేమ్ ఛేంజర్ మూవీ కోసం వెయిట్ చేస్తున్నాను..అంటూ శంకర్ స్పందించారు. 

డైరెక్టర్ శంకర్ 1993 ఇయర్ లో జెంటిల్ మాన్ మూవీ తీసి సూప‌ర్ హిట్. అందుకోవడంతో పాటు..బెస్ట్ డైరెక్టర్ గా అవార్డు ను సొంతం చేసుకున్నారు. ఇక వరుసగా శంకర్ నుంచి వచ్చిన  ప్రేమికుడు, భార‌తీయుడు, జీన్స్, ఒకే ఒక్క‌డు,ప్రేమిస్తే,అపరిచితుడు మూవీస్ తో  ఇండస్ట్రీ ఇండస్ట్రీ హిట్స్ అందుకున్నారు. 

2010లో రోబో వంటి  టెక్నాలజీ ఫిల్మ్తో సెన్సేష‌న్ స‌క్సెస్ ను అందుకున్నారు.ఇలా శంకర్ కెరీర్ ఎంతో వండర్ ఫుల్ మూవీస్ తీయడంలో ఇండియన్ బెస్ట్ డైరెక్టర్స్ లో ఒకరుగా నిలిచారు.  ప్రస్తుతం రామ్ చరణ్ తో తెరకెక్కిస్తున్న గేమ్ ఛేంజర్ మూవీ నుంచి రిలీజ్ చేసిన పోస్టర్, టైటిల్‌ టీజర్ ఎంతగా ట్రెండ్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.