ఇక నో మూవీస్.. ఓన్లీ పాలిటిక్స్.. తమిళ హీరో షాకింగ్ డెసిషన్

ఇక నో మూవీస్.. ఓన్లీ పాలిటిక్స్.. తమిళ హీరో షాకింగ్ డెసిషన్

తమిళ హీరో ఉదయనిధి స్టాలిన్(Udhayanidhi Stalin) షాకింగ్ డెసిషన్ తీసుకున్నాడు. తాను సినిమాలు ఆపేస్తున్నట్టు చెప్పి అభిమానులకు, ఆడియన్స్ కు షాకిచ్చాడు. తాజాగా ఉదయనిధి స్టాలిన్ హీరోగా వస్తున్న మామన్నన్(Maamannan) సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ కు లోకనాయకుడు కమల్ హాసన్(Kamal haasan) చీఫ్ గెస్ట్ గా విచ్చేశాడు. కీర్తి సురేష్(Keerthi suresh) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో.. మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్(Fahadh Faasil) కీ రోల్ పోషించాడు. 

అయితే ఈ ఈవెంట్ వేదికగా ఉదయనిధి స్టాలిన్ సంచలన నిర్ణయం ప్రకటించారు. ఆయన మాట్లాడుతూ.. ఇకపై నేను సినిమాలు చేయను. మామన్నన్ లాంటి సినిమా నా చివరి సినిమా కావడం సంతోషంగా ఉంది. కమల్ హాసన్ నిర్మాణంలో ఒక సినిమా చేయాల్సి ఉంది కానీ.. మంత్రిగా బాధ్యతలు తీసుకున్నాక సినిమాల్లో నటించడం సరికాదని నా అభిప్రాయం. అందుకే సినిమాలు ఆపేస్తున్నాను. 

ఒకవేళ మామన్నన్ దర్శకుడు మారి సెల్వరాజ్(mari selvaraj) మళ్ళీ ఒక మంచి కథతో వస్తే మూడేళ్ళ తర్వాత నటించడానికి ఆలోచిస్తానని అన్నారు. ఇక ఉదయనిధి స్టాలిన్ డెసిషన్ పై అభిమానులు నిరాశ చెందుతున్నారు.