వైగోకు ఏడాది జైలు శిక్ష

వైగోకు ఏడాది జైలు శిక్ష

ఎండీఎంకే జనరల్‌ సెక్రటరీ వైగోకు తమిళనాడు ప్రత్యేక కోర్డు దేశద్రోహం కేసులో ఏడాది పాటు జైలు శిక్ష విధిస్తున్నట్లు ఇవాళ(శుక్రవారం) తీర్పు వెలువరించింది. అయితే వైగో 2008లో ఓ కార్యక్రమంలో పాల్గొన్ని దేశం మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో 2009లో అప్పటి డీఎంకే ప్రభుత్వం ఆయనపై దేశద్రోహం కేసు పెట్టింది. వైగోపై సెక్షన్‌ 124(ఎ) (దేశద్రోహం) సెక్షన్‌ 153 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈయనే స్వయంగా కోర్టులో లొంగిపోయారు. బెయిల్‌కు దరఖాస్తు చేసుకోవడానికి నిరాకరించారు. తర్వాత ఆయనను పోలీసులు కస్టడీలో ఉంచారు. ఇప్పటికే ఈ కేసు మీద ఎన్నో సార్లు విచారణ జరిగింది.