తమిళనాడులో మరో వారం రోజులు సంపూర్ణ లాక్ డౌన్

V6 Velugu Posted on May 22, 2021

సంపూర్ణ లాక్ డౌన్ ఉన్నా..తమిళనాడులో ఇంకా కరోనా కంట్రోల్ కావడంలేదు. కేసులు మరింతగా పెరుగుతున్నాయి. దీంతో..స్టాలిన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మరో వారం పాటు లాక్ డౌన్ పొడిగిస్తున్నట్టు తెలిపింది. మే 24 నుంచి ఈ పొడిగింపు అమల్లోకి రానుంది. ఇంతకుముందు మే 10 నుంచి 24వ తేదీ వరకు లాక్ డౌన్ ప్రకటించింది.

మరో రెండు రోజుల్లో లాక్ డౌన్ ముగియనుండడంతో సీఎం స్టాలిన్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై చర్చించారు. వైద్య, ఆరోగ్య నిపుణులు రెండు వారాలు కఠిన లాక్ డౌన్ విధించాలని సూచించారు. ఎలాంటి మినహాయింపులు లేకుండా పకడ్బందీగా లాక్ డౌన్ విధించాలని, అప్పుడే కరోనా వ్యాప్తి అదుపులోకి వస్తుందని వారు తెలిపారు. 

మే 24నుంచి అమలు కానున్న లాక్ డౌన్ లోనూ అత్యవసర సర్వీసులకు మినహాయిపునిచ్చింది తమిళ సర్కారు.

Tagged Tamil Nadu extends, Covid-19 lockdown, week days, 24 May

Latest Videos

Subscribe Now

More News