
సౌత్ లేడీ సూపర్‌స్టార్ నయనతార(Nayanthara) ప్రధాన పాత్రలో వచ్చిన తాజా మూవీ అన్నపూరణి(Annapoorni). ది గాడెస్ ఆఫ్ ఫుడ్ అనేది ఈ సినిమా ట్యాగ్ లైన్. హీరో జై(Jai), సత్యరాజ్(Sathyaraj), కేఎస్ రవికుమార్(KS Ravikumar) కీలకపాత్రల్లో నటించిన ఈ సినిమాను దర్శకుడు నికిలేష్ కృష్ణ(Nikilesh krishna) తెరకెక్కించారు. టీజర్, ట్రైలర్ తో మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసిన ఈ సినిమా డిసెంబరు 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ప్రేక్షకుల నుండి ఈ సినిమాకు మిశ్రమ స్పందన వస్తోంది.
ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. బ్రాహ్మణ కుటుంబానికి చెందిన నయనతారకు ఇండియాస్ బెస్ట్ ఛెఫ్‌గా ఎదగాలనే కోరిక ఉంటుంది. కానీ దానికి ఆమె తండ్రి ఒప్పుకోరు. అయినప్పటికి ఆమె ఇండియన్ బెస్ట్ ఛెఫ్‌గా ఎలా ఎదిగారు? ఆ క్రమంలో ఆమెకు ఎదురైనా సమస్యలు ఏంటి? అనేది మిగిలిన కథ.
ఇదిలా ఉంటే.. బ్రాహ్మణ కుటుంబానికి సంబంధించిన యువతి ఛెఫ్ అవడం కోసం చేసిన వంటలు వివాదాలకు దారి తీసింది. సినిమాలో కథాంశం బ్రాహ్మణ సమాజాన్ని అవమానించేలా ఉందని.. రాష్ట్రీయ హిందూ మహా సభ రాష్ట్ర అధ్యక్షుడు వేలు మండిపడ్డారు. అంతేకాకుండా ముస్లిం యువకుడు బ్రాహ్మణ యువతిని ప్రేమిస్తున్నట్లుగా చూపించడంపై క్కూడా ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. అందుకే సినిమాను వెంటనే బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ఆపకపోతే.. సినిమా మేకర్స్‌పై సివిల్ కేసు పడతామని, థియేటర్ల వద్ద ఆందోళన చేస్తామని హెచ్చరించారు వేలు. ప్రస్తుతం ఈ వివాదం తమిళనాట హాట్ టాపిక్ గా మారింది. మరి ఈ విషయంపై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తారో చూడాలి.