కళ్లకురిచి కల్తీ మద్యం.. 61కి చేరిన మృతుల సంఖ్య

కళ్లకురిచి కల్తీ మద్యం..  61కి చేరిన మృతుల సంఖ్య

తమిళనాడులోని కళ్లకురిచి జిల్లాలో కల్తీ మద్యం తాగి మరణించిన వారి సంఖ్య 61కి చేరుకుంది. మరో 88 మంది చికిత్స పొందుతున్నారు.  నాలుగు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి పరిస్థితి ఇంకా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.జూన్ 18న జరిగిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.  ఇద్దరు మహిళలతో  సహా 74 మంది ఇప్పటివరకు డిశ్చార్జ్ అయ్యారు. 

జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సి) దీనిని సుమోటోగా స్వీకరించి, తమిళనాడు చీఫ్ సెక్రటరీ మరియు రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్‌కు నోటీసులు జారీ చేసింది.  ఈ ఘటపై విచారణకు ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. మరోవైపు ఈ  దుర్ఘటనపై సమగ్ర నివేదికను సమర్పించేందుకు తమిళనాడు ప్రభుత్వం మద్రాసు హైకోర్టును 10 రోజుల గడువు కోరింది.  నివేదికను దాఖలు చేసేందుకు హైకోర్టు జూలై 3 వరకు గడువు ఇచ్చింది. 

 మరోవైపు ఈ కేసులో ప్రమేయమున్న ఏడుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతుల కుటుంబీకులకు రూ.10 లక్షలు, చికిత్స పొందుతున్న వారికి రూ.50వేలను తమిళనాడు సీఎం స్టాలిన్  ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.