కనెక్ట్ సినిమా విడుదలను అడ్డుకున్న థియేటర్ల యజమానులు

కనెక్ట్ సినిమా విడుదలను అడ్డుకున్న థియేటర్ల యజమానులు

అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో నయనతార ప్రధాన పాత్ర పోషించిన సినిమా కనెక్ట్. హారర్ మూవీ జానర్ లో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 22న తమిళ, తెలుగు భాషల్లో విడుదల కాబోతుంది. ఇంటర్వెల్ లేకుండా ఈ సినిమా ఉండబోతుందని చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది. 

అయితే, రిలీజ్ కి ముందు ఈ సినిమాకు ఎదురుదెబ్బ తగిలేలా ఉంది. ఇంటర్వెల్ లేకుండా వస్తున్న ఈ మూవీని తమిళనాడు థియేటర్ యజమానులు వాళ్ల థియేటర్లలో విడుదల కాకుండా అడ్డుకునేలా కనిపిస్తున్నారు. వాళ్ల థియేటర్లలో సినిమా విడుదలకు ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. ఇంటర్వెల్ లేకపోవడం వల్ల థియేటర్లలో అమ్మే ఫుడ్ ఐటమ్స్ తో  వచ్చే ఆదాయం కోల్పోవడమే దీనికి కారణంగా తెలుస్తోంది. అయితే, థియేటర్ యజమానులతో చిత్ర బృందం ఈ విషయంపై చర్చలు జరుపుతున్నారు.