అజిత్తో గోపిచంద్ మూవీ.. భారీగా ప్లాన్ చేస్తున్న మైత్రి టీమ్

అజిత్తో గోపిచంద్ మూవీ.. భారీగా ప్లాన్ చేస్తున్న మైత్రి టీమ్

తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్(Ajith Kumar) కు తెలుగులో కూడా విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన నుండి ఒక సినిమా వస్తుంది అంటే తెలుగులో కూడా రికార్డ్ కలెక్షన్స్ వచ్చేస్తాయి. అందుకే ఆయన సినిమాలన్నీ తెలుగులో డైరెక్ట్ రిలీజ్ అవుతూ ఉంటాయి. అయితే అజిత్ కుమార్ ఒక డైరెక్ట్ తెలుగు సినిమా చేస్తే చూడాలని తెలుగు ఆడియన్స్ చాలా కాలంగా వెయిట్ చేస్తున్నారు. ఇన్నేళ్లకు వారి ఆశలకు పులిష్టాప్ పడనుంది.

తాజా సమాచారం ప్రకారం అజిత్ కుమార్ తెలుగులో డైరెక్ట్ సినిమా చేయనున్నారు. టాలీవుడ్ మాస్ దర్శకుడు గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేయనున్న ఈ సినిమాకు తెలుగు స్టార్ ప్రొడ్యూసర్స్ మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కనున్న ఈ ప్రాజెక్టు ప్రస్తుతం చర్చల దశలో ఉంది. త్వరలోనే ఈ భారీ ప్రాజెక్టు పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. 

ఇక అజిత్ కుమార్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన విడాయమర్చి అనే సినిమా చేస్తున్నారు. షెరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తరువాత మార్క్ ఆంటోనీ సినిమా దర్శకుడు అధిక రవిచంద్రన్ తో ఓ సినిమా చేయనున్నాడు అజిత్. ఈ రెండు సినిమాల తరువాత అజిత్, గోపీచంద్ సినిమా ఉండనుందని సమాచారం.