ప్రాజెక్ట్ కెలో కమల్.. అధికారిక ప్రకటన వచ్చిందా?

ప్రాజెక్ట్ కెలో  కమల్..  అధికారిక ప్రకటన వచ్చిందా?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ప్రాజెక్ట్ కె. ఈ సినిమాలో లోకనాయకుడు కమల్ హసన్ ఓ కీ రోల్ లో కనిపించనున్నాడు అనే వార్తలు గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అయితే ఈ వార్తల్లో నిజం ఎంత అనేది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. ఎందుకంటే ఈ న్యూస్ పై ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు. అందుకే ఈ న్యూస్ ఇంకా రూమర్ గానే ఉంది. అయితే ఈ రూమర్స్ స్ప్రెడ్ అవడానికి కారణం. కమల్ ప్రాజెక్ట్ కె సెట్స్ కు వెల్లడమే. 

కమల్ నటిస్తున్న తాజా చిత్రం భారతీయుడు2. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఇంకా ప్రాజెక్ట్ కె సినిమా షూటింగ్స్ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో జరుగుతున్నాయి. షూటింగ్ గ్యాప్ లో ప్రాజెక్ట్ కె సెట్స్ కి వెళ్ళాడని సమాచారం. దీంతో కమల్ కూడా ఈ సినిమాలో ఓ కీ రోల్ చేస్తున్నాడు అంటూ వార్తలు పుట్టుకొచ్చాయి.

 ఇక నాగ అశ్విన్ తెరకెక్కిస్తున్న ప్రాజెక్ట్ కె సినిమా 2024 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల మందుకు రానుంది.  సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా రానున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ  మూవీ దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తోంది. దాదాపుగా రూ. 500 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ సినిమా భారీ పాన్ వరల్డ్ రేంజ్ లో తెరకెక్కుతోంది. వైజయంతి మూవీస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న.. ఈ మూవీకి సంతోష్ నారాయణన్ సంగీతం సమకూరుస్తున్నారు.