తమిళనాడు రాజకీయాల్లో బ్రాహ్మణులు తెరమరుగు

తమిళనాడు రాజకీయాల్లో బ్రాహ్మణులు తెరమరుగు

బ్రిటీష్ హయాంలో తమిళనాడులో అన్నీ తామై నడిపించిన బ్రాహ్మణులు ఇప్పుడు అక్కడ రాజకీయంగా  తెరమరగైపోయారు. చట్టసభల్లో అడుగుపెట్టడం అటుంచితే కనీసం పోటీచేయడానికి కూడా వారికి అవకాశాలు రావడం లేదు. ఈసారి తమిళనాడులో లోక్ సభకు మొత్తం160 మంది పోటీ చేయగా అందులో  ముగ్గురు మాత్రమే బ్రాహ్మణులు ఉన్నా రు. జయలలితతోనే బ్రాహ్మణశకం ముగిసిపోయిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రానున్న

కొన్నేళ్ల వరకు మళ్లీ బ్రాహ్మణులు సీఎం కుర్చీలో కూర్చు నే అవకాశం కనుచూపుమేర కనిపించడంలేదని అంటున్నారు. ఒకప్పుడు రాష్ట్ర జనాభాలో 3 శాతం ఉన్న బ్రాహ్మణులు ఇప్పుడు ఉద్యోగాల కోసం దేశ విదేశాల్లో స్థిరపడడంతో వీరి జనాభా 1శాతానికి పడిపోయింది. ఈ క్రమంలో బీజేపీ సాయంతో మళ్లీ రాష్ట్రంలో పుంజుకోవాలని చేస్తున్న ప్రయత్నాలు ఫలించే అవకాశాలు కనిపించడం లేదు.

మొదటి ముఖ్యమంత్రి

1952లో మద్రాస్ స్టేట్ కు జరిగిన ఎన్నికల్లో ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వానికి సి.రాజగోపాలచారి సీఎం అయ్యారు. బ్రాహ్మణుడే అయినా ఆయన వ్యక్తిగతంగా ఏరోజూ బ్రాహ్మణవాదాన్ని ప్రోత్సహించలేదు. 1954 నుంచి ప్రాబల్యం కోల్పయిన బ్రాహ్మణులు 1954 నాటికల్లా కాంగ్రెస్ పార్టీపై సి.రాజగోపాలచారి పట్టుతప్పింది. కామ్ రాజ్ నాడార్ లాంటి బ్రాహ్మణేతరుల పట్టు పెరిగింది. 1991లో అయ్యం గార్ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన జయలలిత సీఎం అయ్యేలోగా రాజకీయాల్లోంచి బ్రాహ్మణులు తెరమరుగైపోయారు. జయలలిత కూడా తన కులస్థులను వెనకేసురావడం కంటే రాజకీయంగా తనకు కలిసి వచ్చే వర్గాలకే ప్రాధాన్యం ఇచ్చారు. ఓటు బ్యాంకు కోసం’ తేవర్’ కులస్థులకు ప్రోత్సహించారు. ప్రతిఫలంగా చాలా ఎన్నికల్లో అన్నాడీఎంకే నెగ్గు కొచ్చింది.

న్యాయవాద వృత్తిలో పాగా

1960 నుంచి న్యాయవాదవృత్తిపై బ్రాహ్మణులు దృష్టిసారించారు. సుప్రీంకోర్టు నుంచి మున్సిఫ్ కోర్టు వరకు అధిపత్యం సాధించారు. ఆతర్వాత గ్లో బలైజేషన్ ఎఫెక్ట్ తో వచ్చిన ఐటీ, ఫైనాన్స్ రంగంలోకి పెద్దసంఖ్యలో ప్రవేశించి, దేశ విదేశాల్లో స్థిరపడ్డారు. అగ్రహారాలు ఖాళీ వలసలతో ఒకప్పుడు బ్రాహ్మణులు మాత్రమే నివసించే అగ్రహారాలు ఖాళీ అయిపోయాయి. దీంతో ఇతర కులాలు ఇప్పుడు అక్కడ ఇళ్లు కొనుక్కొని స్థిరపడ్డారు.