అమిత్ షా వార్నింగ్ .. క్లారిటీ ఇచ్చిన తమిళిసై

అమిత్ షా వార్నింగ్  ..  క్లారిటీ  ఇచ్చిన తమిళిసై

తెలంగాణ మాజీ గవర్నర్, బీజేపీ నేత తమిళిసైకి నిన్న హోంమంత్రి అమిత్ షా వార్నింగ్ ఇచ్చారనే వార్తలపై ఆమె స్పష్టత ఇచ్చారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు.   'నిన్న నేను హోంమంత్రి అమిత్ షాను కలిశాను. 2024 ఎన్నికల తర్వాత పరిస్థితి, ఎదుర్కొన్న సవాళ్ల గురించి ఆయన నన్ను అడిగారు. రాజకీయంతో పాటు నియోజకవర్గ పనులను చూసుకోవాలని సూచించారు. నా గురించి వస్తున్న ఊహాగానాలకు స్పష్టత ఇవ్వడానికి ఈ పోస్టు' అని ఆమె తన ట్వీట్ లో వెల్లడించారు.

esterday as I met our Honorable Home Minister Sri @AmitShah ji in AP for the first time after the 2024 Elections he called me to ask about post poll followup and the challenges faced.. As i was eloborating,due to paucity of time with utmost concern he
adviced to carry out the…

ఏపీలో చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారానికి హాజరైన అమిత్ షా, తమిళి సై సౌందరరాజన్‌మధ్య జరిగిన మాటలు, హావభావాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వేదికపైకి వచ్చిన తమిళి సై.. అందర్నీ అభివాదం చేస్తూ ముందుకు వెళుతున్నారు. 

ఈ సమయంలో అమిత్ షా దగ్గర రాగానే.. ఆయన తమిళి సైని పిలిచి.. ఏదో సీరియస్ గా చెప్పటం కనిపించింది. అంతేనా.. తమిళి సైని హెచ్చరిస్తున్నట్లు వేలు చూపిస్తూ.. అమిత్ షా గంభీరంగా మాట్లాడటం వీడియోలో స్పష్టంగా కనిపించింది. తమిళనాడు బీజేపీలో ఇటీవల జరిగిన అంతర్గత కుమ్ములాటలపై తమిళి సైతో అమిత్ షా  చర్చించినట్లుగా సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.