బండారు దత్తాత్రేయ నా గురువు : తమిళిసై సౌందరరాజన్

బండారు దత్తాత్రేయ నా గురువు : తమిళిసై సౌందరరాజన్

హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ తనకు గురువని,  ఆయన మార్గనిర్దేశనంలో తాను ఎన్నో కార్యక్రమాలు చేశానన్నారు తెలంగాణ గవర్నర్  తమిళిసై సౌందరరాజన్ అన్నారు.   శిల్పకళావేదికలో శ్రీ గురు భగవత్ మహోత్సవ్ కార్యక్రమానికి ఆమె చీఫ్ గెస్టుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..ఉదయం నుంచి వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న తాను  ఇప్పుడే హైదరాబాద్ కు వచ్చానని చెప్పారు.  తాను తమిళనాడు అమ్మాయిని... తెలంగాణ కూతురిని అని చెప్పుకొచ్చారు.  అందుకే తెలంగాణలో ఏ కార్యక్రమం ఉన్న తప్పకుండా వస్తానన్నారు.  తెలంగాణకు ఎంత చేయాలో, ఏం చేయాలో అంతా చేస్తానని చెప్పారు.  

ఆధ్యాత్మిక శక్తి అంతా ఇంతా కాదన్న గవర్నర్ ... మనకు  తెలియని శక్తిని అందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో  - హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, తనికెళ్ళ భరణి, డి.ఆర్.డి.ఓ. మాజీ ఛైర్మెన్ సతీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.