తాండూరు, వెలుగు: వికారాబాద్ జిల్లా తాండూరులో ఆర్టీసీ సమ్మెకు టెంట్హౌస్సామాను ఇచ్చినందుకు పోలీసులు టెంట్హౌస్ఓనర్పై కేసు నమోదు చేశారు. తాండూరులోని ఆర్టీసీ జేఏసీ నిరసనకు ఎస్ఎం టెంట్హౌస్యజమాని సామగ్రి సప్లై చేయడంతో కేసు నమోదు చేశామని టౌన్సీఐ బొంగు పరమేశ్వర్ తెలిపారు. ఆర్టీసీ సమ్మె చట్ట విరుద్ధమని, ఇంకా ఎవరు ఇలా చేసినా కేసులు తప్పవన్నారు.

