ఆస్ట్రేలియాకు తాండూరు కందులు..అంతర్జాతీయ గుర్తింపు పొందిన తర్వాత మొదటిసారి విదేశాలకు ఎగుమతి

ఆస్ట్రేలియాకు తాండూరు కందులు..అంతర్జాతీయ గుర్తింపు పొందిన తర్వాత మొదటిసారి విదేశాలకు ఎగుమతి
  •  అపెడా సహకారంతో హైదరాబాద్ నుంచి 2.5 మెట్రిక్ టన్నుల కందుల రవాణా
  • తెలంగాణ నుంచి వ్యవసాయ ఉత్పత్తుల్లో జీఐ ట్యాగ్ ..
  • దక్కించుకున్న ఏకైక పంటగా తాండూరు కందులు ఖ్యాతి 

హైదరాబాద్, వెలుగు : ఇదివరకే భౌగోళిక గుర్తింపు (జీఐ) పొందిన తాండూరు కందులు మరో రికార్డ్​ సొంతం చేసుకున్నాయి. అంతర్జాతయ గుర్తింపు పొందిన కందులు తొలిసారిగా ఆస్ట్రేలియాకు ఎగుమతి అవుతున్నాయి. 

కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని వ్యవసాయ, ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్‌‌‌‌పోర్ట్ డెవలప్‌‌‌‌మెంట్ అథారిటీ (అపెడా) సహకారంతో బుధవారం హైదరాబాద్ నుంచి ఎగుమతులను జెండా ఊపి ప్రారంభించారు. 

తెలంగాణ వ్యవసాయ, సహకార శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్, అపెడా అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఆర్.పి. నాయుడు వర్చువల్ లో  కార్యక్రమంలో పాల్గొన్నారు. మొదటి విడతలో హైదరాబాద్‌‌‌‌కు చెందిన దుర్గా ఎక్స్‌‌‌‌పోర్ట్స్, ఇంపోర్ట్స్ సంస్థ ‘అమ్మాస్’బ్రాండ్ పేర 2.5 మెట్రిక్ టన్నుల కందులు ఉన్నాయి. 

ఆస్ట్రేలియాలోని భారతమ్మ పీటీవై లిమిటెడ్ సంస్థకు పంపించింది. దుర్గా ఎక్స్ పోర్ట్స్​సంస్థ తెలంగాణ నుంచి బియ్యం, పప్పుధాన్యాలు, సుగంధ ద్రవ్యాలు, కిరాణా సరుకులను విదేశాలకు ఎగుమతి చేస్తోంది. 

‘అపెడా’ చేయూత 

దేశంలోని జీఐ గుర్తింపు పొందిన వ్యవసాయ ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్​లో ప్రోత్సహించేందుకు అపెడా కృషి చేస్తోంది. ఎగుమతి అనుసంధానాలు కల్పించడం, వాణిజ్య ప్రదర్శనల్లో ఎగుమతిదారులు పాల్గొనేలా ప్రోత్సహించడం, ఎగుమతి అవకాశాలు, మార్కెట్ ప్రవేశంపై దిశానిర్దేశం చేయడం ద్వారా ఈ పంటలు పండించే రైతులకు చేయూతనిస్తోంది.

 దేశంలోని ప్రత్యేక ప్రాంతీయ వ్యవసాయ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్త గుర్తింపు తేవడం, రైతులు, రైతు ఉత్పత్తిదారుల సంస్థలు (ఎఫ్‌‌‌‌పీఓలు), రైతు ఉత్పత్తిదారుల కంపెనీలు (ఎఫ్‌‌‌‌పీసీలు), ఎగుమతిదారులకు స్థిరమైన మార్కెట్ అవకాశాలు కల్పించడానికి అపెడా కృషి చేస్తోంది.

 ఎగుమతిదారులు, భాగస్వాములతో నిరంతర సంప్రదింపుల ద్వారా భారత వ్యవసాయ ఉత్పత్తులకు ప్రపంచ మార్కెట్‌‌‌‌లో స్థానం పెంచడానికి, కొత్త ఎగుమతి అవకాశాలు సృష్టించడానికి, భారతదేశ సుసంపన్న వ్యవసాయ వారసత్వాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడానికి అపెడా కట్టుబడి ఉందని అధికారులు తెలిపారు. 

ఈ కార్యక్రమంలో హైదరాబాద్‌‌‌‌లోని అపేడా అదనపు విదేశీ వాణిజ్య డైరెక్టర్ జనరల్ డాక్టర్ సంపత్ కుమార్ , దుర్గా ఎక్స్‌‌‌‌పోర్ట్స్, ఇంపోర్ట్స్ ప్రతినిధి సుమంత్ ఆర్, అధికారులు పాల్గొన్నారు. ఇదివరకే భౌగోళిక గుర్తింపు (జీఐ) పొందిన తాండూరు కందులు మరో రికార్డ్​ సొంతం చేసుకున్నాయి.

 అంతర్జాతయ గుర్తింపు పొందిన కందులు తొలిసారిగా ఆస్ట్రేలియాకు ఎగుమతి అవుతున్నాయి. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని వ్యవసాయ, ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్‌‌‌‌పోర్ట్ డెవలప్‌‌‌‌మెంట్ అథారిటీ (అపెడా) సహకారంతో బుధవారం హైదరాబాద్ నుంచి ఎగుమతులను జెండా ఊపి ప్రారంభించారు. 

తెలంగాణ వ్యవసాయ, సహకార శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్, అపెడా అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఆర్.పి. నాయుడు వర్చువల్ లో  కార్యక్రమంలో పాల్గొన్నారు. మొదటి విడతలో హైదరాబాద్‌‌‌‌కు చెందిన దుర్గా ఎక్స్‌‌‌‌పోర్ట్స్, ఇంపోర్ట్స్ సంస్థ ‘అమ్మాస్’బ్రాండ్ పేర 2.5 మెట్రిక్ టన్నుల కందులు ఉన్నాయి. ఆస్ట్రేలియాలోని భారతమ్మ పీటీవై లిమిటెడ్ సంస్థకు పంపించింది దుర్గా ఎక్స్ పోర్ట్స్​సంస్థ .