
భువనేశ్వర్‌లోని పూరి స్టేషన్‌లో అగ్నిప్రమాదం జరిగింది. పూరి-హటియా తపస్విని ఎక్స్‌ప్రెస్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మంటలు చెలరేగిన సమయంలో రైలులో ఎవరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. మొదట S-4 భోగి నుంచి దట్టమైన పొగలు వచ్చి మంటలు అలుముకున్నాయి. S-4 భోగి పూర్తిగా కాలిపోగా, S-3, S-5 భోగీలు స్వల్పంగా దెబ్బతిన్నాయి. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కలిసి మంటలను అదుపులోకి తెచ్చాయి.