HariHara Veeramallu: నిధి అందాల వేటతో అదరహో.. వీరమల్లు కొత్త పాట మాములుగా లేదు గురూ

HariHara Veeramallu: నిధి అందాల వేటతో అదరహో.. వీరమల్లు కొత్త పాట మాములుగా లేదు గురూ

హరిహర వీరమల్లు మూవీ నుంచి నాలుగో పాట వచ్చేసింది. నేడు మే28న ‘తారా తారా-ది సిజ్లింగ్ సింగిల్’ అనే లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్.ఆస్కార్ గ్రహీత కీరవాణి స్వరపరిచిన ఈ రొమాంటిక్ గీతాన్నిశ్రీ హర్ష ఈమని రాయగా.. లిప్సికా భాష్యం, ఆదిత్య అయ్యంగార్ పాడారు. శోభి పౌల్రాజ్ నృత్యాలు సమకూర్చారు. 

వినసొంపుగా సాగిన ఈ పాటలో హీరోయిన్ నిధి అగర్వాల్‌ తన గ్లామర్‌తో ఆకట్టుకుంటోంది. పీరియడ్ యాక్షన్ మూవీలో నిధి తన అందాలతో వచ్చిన ఈ పాట మరిన్ని అంచనాలు పెంచేసింది. 

ఇప్పటికే హరిహర వీరమల్లు నుంచి రిలీజైన మాట వినాలి, కొల్లగొట్టి నాదిరో, అసుర హననం సాంగ్స్ సైతం ప్రేక్షకాదరణ పొందాయి. ఇపుడీ  హాటెస్ట్ 'తారా తారా' ట్రాక్‌ పవర్ స్టార్ అభిమానుల్లో దాగున్న వేడిని బయటకే తీసుకొచ్చే విధంగా ఉంది. మరి థియేటర్స్ లో రచ్చ రచ్చే అని చెప్పొచ్చు. ఇకపోతే ఈ మూవీ జూన్ 12న విడుదల కానుంది.