నయా ఖబర్

నయా ఖబర్

‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఎన్టీఆర్ సినిమా ఎప్పుడెప్పుడు సెట్స్‌‌కి వెళ్తుందా అని ఎదురుచూస్తున్న అభిమానులకు గుడ్‌‌ న్యూస్ అందింది. అతి త్వరలో వారి కోరిక నెరవేరబోతోంది. కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి తారక్ కమిటై చాలాకాలమే అయ్యింది. ఇప్పటికే  షూటింగ్‌‌లోనూ జాయినవ్వాల్సి ఉంది. కానీ స్ర్కిప్ట్‌‌ వర్క్‌‌కి కొరటాల కాస్త ఎక్కువ రోజులు తీసుకోవడంతో లేటయ్యింది. ఎట్టకేలకి ప్రీ ప్రొడక్షన్ పూర్తయ్యిందంటూ నిన్న అనౌన్స్‌‌మెంట్ వచ్చింది. కొరటాల శివతో పాటు సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్‌‌ కలిసి ప్రీ ప్రొడక్షన్ పూర్తి చేసినట్టు ప్రకటించడంతో పాటు అతి త్వరలోనే మూవీ సెట్స్‌‌కి వెళ్లనుందని కన్‌‌ఫర్మ్ చేశారు. నవంబర్ ఫస్ట్‌‌ వీక్‌‌లో షూటింగ్ స్టార్ట్ చేయనున్నట్టు తెలుస్తోంది. హీరోయిన్‌‌తో సహా ఇతర నటీనటుల వివరాలను కూడా త్వరలోనే ప్రకటిస్తామన్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. నెక్స్ట్ ఇయర్ ఎండింగ్‌‌లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారని సమాచారం.