ముత్యాల బిర్యానీ.. తింటుంటే ఆహా అనాల్సిందే

ముత్యాల బిర్యానీ.. తింటుంటే ఆహా అనాల్సిందే

హైదరాబాద్ బిర్యానీ లాగానే.. టేస్టీ అండ్ పాపులర్ బిర్యానీలు మన దేశంలో ఇంకా చాలానే ఉన్నాయి. వరల్డ్ వైడ్ ఫేవరెట్ అయిన అలాంటి కొన్ని బిర్యానీల గురించి తెలుసుకుందాం.

  • దమ్, ఫ్రై పీస్, చికెన్ దమ్ బిర్యానీ.. ప్రాంతమేదైనా ఎక్కువగా వినిపించే బిర్యానీ స్పెషల్స్ ఇవే. కానీ ముత్యాల బిర్యానీ గురించి ఎవరూ విని ఉండరు. అవును అచ్చంగా ముత్యాలతో చేసిన బిర్యానీ ఇది. నవాబ్ వజీద్ అలీ షా అనే రాజు మొదటిసారి ఈ ముత్యాల బిర్యానీని పరిచయం చేశాడట. ముత్యాలు ఎలా తింటారనేగా మీ డౌట్. బిర్యానీ తయారీ కోసం వాడే ముత్యాలన్నీ తినేవే. ఉడకబెట్టిన కోడిగుడ్లను బంగారం, వెండి ర్యాపర్స్ లో చుట్టి ముత్యాలని చికెన్ స్టఫ్ చేసి ఈ బిర్యానీ తయారు చేయించాడు. వజీద్. కానీ, ఆ తర్వాత ఈ బిర్యానీ మారుతూ వచ్చింది. ముత్యాల బిర్యానీ ప్రస్తుతం ఈ ముత్యాల బిర్యానీని కోఫ్తాలతో తయారుచేస్తున్నారు. 
  •  కోల్కత్తా  వెళ్తే తప్పకుండా రుచి చూడాల్సిన రెసిపీలలో స్పెషల్ వెజిటబుల్ బిర్యానీ ఒకటి. రకరకాల కూరగాయలు, కోల్కత్తా  యునిక్ ఫ్లేవర్స్ తో   నోరూరించే ఈ బిర్యానీ తయారీ వెనక ఉంది కూడా నవాబ్ వజీద్ అలీషానే. ఒకానొక టైంలో వజీద్ దగ్గర చికెన్, మటన్ కొనడానికి డబ్బులు లేవట. దాంతో ఆయన్ని సంతోషపెట్టడానికి ఆలుగడ్డలతో బిర్యానీ ట్రై చేశారట వంటవాళ్లు. అప్పట్నించీ  కోల్కత్తా బిర్యానీ ప్రతి ఇంట్లో ఘుమఘుమలాడుతూనే ఉంది.
  • నార్త్ ఇండియా అచారీ బిర్యానీకి కూడా ఫ్యాన్స్ ఎక్కువే. పచ్చడి మసాలాలతో తయారుచేయడం ఈ బిర్యానీ స్పెషాలిటీ. ఆనియన్ సీడ్స్, ధనియాలు, మెంతులు, ఆవాలు, జీలకర్రతో తయారైన ఈ బిర్యానీని ఒక్కసారి తింటే జీవితాంతం రుచి వెంటాడుతూనే ఉంటుంది. అలాగే రాజస్తానీ స్పెషల్ జోధ్పూరి బిర్యానీ కూడా తినే కొద్దీ తినాలనిపిస్తుంది.

Also read :- ఆధార్ గుడ్ న్యూస్ : కూల్ గా, నిదానంగా అప్‌డేట్ చేసుకోండి

  • అస్సాంలో కంపూరీ బిర్యానీ చాలా ఫేమస్. సింపుల్ గా  టేస్టీ ఉండేది. దీని ఫ్లేవర్స్ నోట్లో నీళ్లూరిస్తాయి. చికెన్ని పచ్చిబఠాణీ, క్యారెట్స్, బీన్స్, ఆలుగడ్డలు, క్యాప్సికమ్ లతో కలిపి ఉడికించి ఈ బిర్యానీ తయారుచేస్తారు. యాలకులు, జాజికాయ బిర్యానీ రుచిని మరింత పెంచుతాయి. అలాగే కర్ణాటకలోని బియరీ బిర్యానీ రుచి గురించి ఎంత చెప్పినా తక్కువే.
  •  ఒడిషాలోని కటక్ బిర్యానీని లైఫ్ ఒక్కసారైనా రుచి చూడాల్సిందే. పర్షియా నుంచి ఒడిషాకి వచ్చిన ఈ బిర్యానీ మొదటిసారి సోల్జర్స్ తయారుచేశారట. కార్పోహైడ్రేట్స్, ప్రొటీన్స్ ఎక్కువగా ఉండే ఈ బిర్యానీ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.