
న్యూఢిల్లీ: టాటా క్యాపిటల్ తన రూ.17 వేల కోట్ల( 2 బిలియన్ డాలర్ల) విలువైన ఐపీఓని అక్టోబర్‌లో ప్రారంభించనుంది. ఈ ఐపీఓకు 18 బిలియన్ డాలర్ల వాల్యుయేషన్‌ను లెక్కించారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో సెబీ వద్ద ఫైలైన కాన్ఫిడెన్షియల్ వాల్యుయేషన్ 11 బిలియన్ డాలర్లతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ.
టాటా క్యాపిటల్ ఐపీఓ ఈ ఏడాది వచ్చిన రెండో అతిపెద్ద ఐపీఓగా నిలవనుంది. హ్యుందాయ్ (రూ. 27,870 కోట్ల) ఐపీఓ మొదటి ప్లేస్‌లో ఉంది. ఈ పబ్లిక్ ఇష్యూలో 21 కోట్ల కొత్త షేర్లు, 26.58 కోట్ల ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) షేర్లు ఉంటాయని టాటా క్యాపిటల్ పేర్కొంది.
టాటా సన్స్ 23 కోట్ల షేర్లను, ఐఎఫ్‌సీ (ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్) 3.58 కోట్ల షేర్లను విక్రయించనుంది. ప్రస్తుతం టాటా క్యాపిటల్‌లో టాటా సన్స్‌కు 88.6శాతం, ఐఎఫ్‌సీకి 1.8 శాతం వాటా ఉంది.