150 బోయింగ్ విమానాలు కొననున్న ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇండియా!

150 బోయింగ్ విమానాలు కొననున్న ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇండియా!

న్యూఢిల్లీ: టాటా గ్రూప్ కంపెనీ ఎయిర్‌‌‌‌ ‌‌‌‌ఇండియా పెద్ద మొత్తంలో విమానాలను కొనే పనిలో ఉంది.  737 మ్యాక్స్‌‌‌‌ విమానాలను 150 వరకు కొనేందుకు బోయింగ్‌‌‌‌తో ఈ కంపెనీ  డీల్ కుదుర్చుకుందని ఎకనామిక్‌‌‌‌ టైమ్స్‌‌‌‌ రిపోర్ట్ చేసింది.  మొదట 50 విమానాల వరకు ఆర్డర్ పెట్టి, ఆ తర్వాత ఈ ఆర్డర్‌‌ను 150 వరకు పొడిగించే అవకాశం ఉంది. డొమెస్టిక్‌‌‌‌, ఇంటర్నేషనల్ మార్కెట్‌‌‌‌లో  వాటా  పెంచుకోవడానికి ఈ కొత్త విమానాలు కంపెనీకి సాయపడతాయి. ప్రస్తుతం ఎయిర్‌‌‌‌‌‌‌‌ఇండియా దగ్గర పాత విమానాలే ఎక్కువగా ఉన్నాయి.  

బోయింగ్‌‌‌‌, ఎయిర్‌‌‌‌ ‌‌‌‌ఇండియాలు ఈ విషయంపై స్పందించలేదు. ఎయిర్ ఇండియా ఏకంగా 300 చిన్న విమానాలను, 70 పెద్ద విమానాలను కొనుగోలు చేసేందుకు ఎయిర్‌‌‌‌‌‌‌‌బస్‌‌‌‌, బోయింగ్‌‌‌‌తో చర్చలు జరుపుతోందని,  వీటి కోసం 50 బిలియన్ డాలర్ల వరకు  ఖర్చు చేయనుందని ఈ ఏడాది జులైలో వార్తలొచ్చాయి. కిందటేడాది ఆకాశ ఎయిర్ కూడా బోయింగ్‌‌‌‌కు పెద్ద ఆర్డర్‌‌‌‌‌‌‌‌ ఇచ్చింది.  72  ‘737 మ్యాక్స్‌‌‌‌’ విమానాలను  కొనుగోలు చేసేందుకు డీల్ కుదుర్చుకుంది.