హల్దీరామ్​లో టాటాలకు వాటా?

హల్దీరామ్​లో టాటాలకు వాటా?

ముంబై/న్యూఢిల్లీ :  చిరుతిండ్ల తయారీ సంస్థ హల్దీరామ్‌‌లో కనీసం 51శాతం వాటా కొనుగోలు చేసేందుకు టాటా గ్రూప్ కన్జూమర్​ యూనిట్​ చర్చలు జరుపుతోంది. అయితే హల్దీరామ్ 10 బిలియన్ డాలర్ల వాల్యుయేషన్​ను కోరడం టాటాలకు నచ్చడం లేదని ఈ సంగతి తెలిసిన వాళ్లు చెప్పారు. చర్చలు విజయవంతమైతే టాటాలు.. పెప్సీ, రిలయన్స్ రిటైల్‌‌తో నేరుగా పోటీపడవచ్చు.  పది శాతం వాటా విక్రయం గురించి బైన్ క్యాపిటల్‌‌తో సహా ప్రైవేట్ ఈక్విటీ సంస్థలతో కూడా హల్దీరామ్​ చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. టాటాలకు ఇది వరకే యూకే టీ కంపెనీ టెట్లీతోపాటు స్టార్‌‌బక్స్‌‌తో వ్యాపార భాగస్వామ్యాలు ఉన్నాయి.  

టాటాలు 51శాతం కంటే ఎక్కువ వాటా కొనుగోలు చేయాలనుకుంటున్నారని, అయితే హల్దీరామ్​ పెద్దమొత్తం కోరుతోందని తెలుస్తోంది.  టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ ప్రతినిధితోపాటు హల్దీరామ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ క్రిషన్ కుమార్ ఈ వార్తలపై కామెంట్​ చేయడానికి నిరాకరించారు. యూరో మానిటర్ ఇంటర్నేషనల్ ప్రకారం, భారతదేశ   6.2 బిలియన్ డాలర్ల స్నాక్ మార్కెట్‌‌లో హల్దీరామ్​కు దాదాపు 13శాతం వాటా ఉంది.

లే చిప్‌‌లకు ప్రసిద్ధి చెందిన పెప్సీకి కూడా దాదాపు 13శాతం వాటా ఉంది. హల్దీరామ్ స్నాక్స్ సింగపూర్,  యునైటెడ్ స్టేట్స్ వంటి విదేశీ మార్కెట్లలో కూడా అమ్ముడవుతాయి. కంపెనీకి స్థానికంగా ఆహారం, స్వీట్లు, విదేశీ వంటకాలను అమ్మే దాదాపు 150 రెస్టారెంట్లు ఉన్నాయి.