టాటా సఫారీ, హారియర్ కార్లకు కొత్త పెట్రోల్ ఇంజిన్

టాటా సఫారీ, హారియర్ కార్లకు కొత్త పెట్రోల్ ఇంజిన్

టాటా మోటార్స్ ఇటీవలే హారియర్, సఫారితో సహా తన రెండు ప్రీమియం SUVల ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లను విడుదల చేసింది. కంపెనీ నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్‌ను కూడా ఆవిష్కరించింది. తాజాగా టాటా మోటార్స్ తన ప్రీమియం స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్ - హారియర్, సఫారీలలో వినియోగిస్తున్న కొత్త పెట్రోల్ పవర్‌ట్రెయిన్‌ను అభివృద్ధి చేస్తోందని కంపెనీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఈ మోడల్స్ ప్రస్తుతం ఈ రెండు వేరియంట్లలో 2-లీటర్ల డీజిల్ ఇంజన్‌ను వినియోగిస్తున్నారు. అయితే రాబోయే రెండు, మూడేళ్లలో కొత్త పెట్రోల్ ఇంజిన్ అందుబాటులోకి వస్తుందని అధికారి తెలిపారు.

ఈ ప్రీమియం ఎస్‌యూవీ రేంజ్ కార్లు ఏడాదికి 2 లక్షల యూనిట్ల వరకు అమ్ముడవుతున్నట్టు టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ మేనేజింగ్ డైరెక్టర్ శైలేష్ చంద్ర చెప్పారు. ఇందులో 80శాతం డీజిల్ వెహికిల్సేనన్నారు. డీజిల్ ఇంజిన్ పై దృష్టి సారిస్తూనే.. మార్కెట్ 20శాతం డిమాండ్ ఉన్న  ఎస్‌యూవీల్లో పెట్రోల్ ఇంజిన్ చేయాలనే విషయాన్ని తేలిగ్గా తీసుకోలేమని చెప్పారు. దీని కోసమే 1.5లీ. జీడీఐ(గ్యాసోలిన్ డెరెక్ట్ ఇంజక్షన్) ఇంజిన్ ను అభివృద్ధి చేస్తున్నట్టు తెలిపారు.

ఇటీవలే టాటా మోటార్స్ హారియర్, సఫారి కొత్త వెర్షన్‌లను విడుదల చేసింది. దీని ధర వరుసగా రూ. 15.49 లక్షలు, రూ. 16.19 లక్షలు. ఈ రెండూ కూడా ప్రయాణికుల రక్షణలో ఫైవ్‌ స్టార్‌ రేటింగ్‌ పొందాయి. కారులో ప్రయాణించే పెద్దలు, పిల్లల రక్షణ విషయంలో భారత్‌ న్యూ కార్‌ అసెస్మెంట్‌ ప్రోగ్రామ్‌ కింద ఫైవ్‌ స్టార్‌ రేటింగ్‌ పొందిన తొలి ఎస్‌యూవీలు కూడా ఇవే.