కరెంటు బండ్లపై టాటా ఫోకస్‌‌‌‌!

కరెంటు బండ్లపై టాటా ఫోకస్‌‌‌‌!

న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) బిజినెస్‌‌‌‌‌‌‌‌ను విస్తరించేందుకు ఫండ్స్‌‌‌‌‌‌‌‌ సేకరించాలని టాటా మోటార్స్ చూస్తోంది.  అఫోర్డబుల్ ధరలోనే ఎలక్ట్రిక్ కార్లను అందుబాటులోకి తెచ్చేందుకు స్ట్రాటజిక్ పార్టనర్ల కోసం కంపెనీ వెతుకుతోందని కంపెనీ ఉద్యోగి ఒకరు పేర్కొన్నారు. ప్రైవేట్‌‌‌‌‌‌‌‌ ఈక్విటీ ఫండ్స్‌‌‌‌‌‌‌‌, సావరిన్ వెల్త్‌‌‌‌‌‌‌‌ ఫండ్స్‌‌‌‌‌‌‌‌తో చర్చలు జరుపుతోందని అన్నారు.  స్ట్రాటజిక్ పార్టనర్ దొరికితే కంపెనీ అప్పులు కూడా తగ్గుముఖం పడతాయి. టాటా మోటార్స్‌‌‌‌‌‌‌‌ చర్చలు ఇంకా స్టార్టింగ్ స్టేజ్‌‌‌‌‌‌‌‌లోనే ఉన్నాయని, ఇవి డీల్‌‌‌‌‌‌‌‌ కింద మారకపోవచ్చని కూడా పైన పేర్కొన్న ఉద్యోగి తెలిపారు.  ప్యాసెంజర్ వెహికల్ బిజినెస్‌‌‌‌‌‌‌‌ను సెపరేట్‌‌‌‌‌‌‌‌ చేయాలని టాటా మోటార్స్‌‌‌‌‌‌‌‌  కిందటేడాది మార్చిలో నిర్ణయించుకుంది. ఎలక్ట్రిక్ వెహికల్ బిజినెస్‌‌‌‌‌‌‌‌ను సబ్సిడరిగా  మార్చాలని చూస్తోంది. ఈ బిజినెస్‌‌‌‌‌‌‌‌ కోసం సరియైన స్ట్రాటజిక్ పార్టనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లేదా ఇన్వెస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గురించి వెతుకుతోంది. ఈవీ బిజినెస్‌‌‌‌‌‌‌‌పై టాటా గ్రూప్‌‌‌‌‌‌‌‌కు అంచనాలు ఎక్కువగా ఉన్నాయని సంబంధిత వ్యక్తులు పేర్కొన్నారు. ఈ బిజినెస్ వాల్యుయేషన్‌‌‌‌‌‌‌‌ ఎక్కువగా ఉండాలంటే, కంపెనీ వాల్యూమ్స్‌‌‌‌‌‌‌‌ కూడా ఎక్కువగా ఉండాలని తెలిపారు. కాగా,  ప్యాసెంజర్ వెహికల్ బిజినెస్‌‌‌‌‌‌‌‌ కోసం చైనీస్  కంపెనీ గీలితో టాటా మోటార్స్ చర్చలు జరుపుతోందని వార్తలు మార్కెట్లో చక్కర్లు కొడుతున్నాయి. కంపెనీ సబ్సిడరీ జాగ్వార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ల్యాండ్‌‌‌‌‌‌‌‌ రోవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (జేఎల్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) ఇప్పటికే  చైనీస్ కంపెనీ చెరీ ఆటోమొబైల్‌‌‌‌‌‌‌‌ ఆఫ్ చైనాతో  కలిసి పనిచేస్తోంది. ప్యాసెంజర్ వెహికల్ బిజినెస్‌‌‌‌‌‌‌‌ను సపరేట్‌‌‌‌‌‌‌‌గా మార్చడానికి షేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హోల్డర్లు ఇప్పటికే అనుమతి ఇచ్చారు. ఇక నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ నుంచి అనుమతులొస్తే కంపెనీ ప్యాసెంజర్ వెహికల్‌‌‌‌‌‌‌‌ బిజినెస్ మరింత ముందుకెళుతుంది. ఈ ప్రాసెస్‌‌‌‌‌‌‌‌ ఈ ఏడాది సెప్టెంబర్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కంటే ముందు పూర్తవుతుందనే అంచనాలున్నాయి. 

మార్చి,2022 లోపు కొత్తగా 75 స్టోర్లు: క్రోమా

టాటా గ్రూప్‌‌‌‌‌‌‌‌కు చెందిన క్రోమా తన బిజినెస్‌‌‌‌‌‌‌‌ను మరింత విస్తరించాలని ప్లాన్స్ వేసుకొంది. 2021–22 లో  కొత్తగా 75 స్టోర్లను ఓపెన్‌‌‌‌‌‌‌‌ చేయాలని చూస్తోంది. వచ్చే రెండేళ్లలో మరో 100 స్టోర్లను ఓపెన్ చేస్తామని క్రోమా సీఎంఓ రితేష్‌‌‌‌‌‌‌‌ ఘోసల్‌‌‌‌‌‌‌‌ అన్నారు. స్మార్ట్‌‌‌‌‌‌‌‌ఫోన్లు, ల్యాప్‌‌‌‌‌‌‌‌టాప్‌‌‌‌‌‌‌‌లు, హోమ్‌‌‌‌‌‌‌‌ అప్లెయెన్సెస్‌‌‌‌‌‌‌‌ వంటి ప్రొడక్ట్‌‌లను  క్రోమా అమ్ముతోంది.