Auto News : దసరా నుంచి దీపావళి వరకు లక్ష కార్లు అమ్మాం..

Auto News : దసరా నుంచి దీపావళి వరకు లక్ష కార్లు అమ్మాం..

దేశీయ కార్ల తయారీ కంపెనీ టాటా మోటార్స్  దసరా నవరాత్రి ఉత్సవాల నుండి దీపావళి పండుగ సీజన్‌లో భారీ అమ్మకాలు చేసింది. ఈ కాలంలో 1 లక్ష కంటే ఎక్కువ కార్లు అమ్ముడు కాగా,  గత ఏడాదితో పండుగ సీజన్ తో పోల్చితే 33% ఎక్కువ. ఈసారి కూడా SUV (స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్) కార్లే ఎక్కువగా అమ్ముడయ్యాయి. 

ఇక టాటా నెక్సాన్ (Nexon) సెప్టెంబర్ 2025లో దేశంలోనే అత్యధికంగా 38 వేల కార్లు అమ్ముడయ్యాయి, కిందటి ఏడాది కంటే ఈసారి 73% ఎక్కువ. అలాగే టాటా పంచ్ (Punch) 32 వేల కార్లు అమ్ముడై, 29% పెరుగుదలను చూపించింది. అంతేకాకుండా ఎలక్ట్రిక్ వాహనాలు (EVలు) ఈ పండుగ సీజన్లో 10 వేల కంటే ఎక్కువగా  అమ్ముడయ్యాయి, ఈసారి 37% వృద్ధి చూస్తోంది.

ఈ గొప్ప సేల్స్ పై  కంపెనీ ఏమంటోందంటే "ఈ 30 రోజుల పండగ సీజన్లో 1 లక్షకు పైగా కార్లను డెలివరీ చేసి  ఒక గొప్ప మైలురాయిని చేరుకున్నాము, ఇది మాకు 33% వృద్ధి చూపిస్తుంది. మా SUV కార్లు చాలా బాగా అమ్ముడయ్యాయి. నెక్సాన్, పంచ్ నుండి టాటా EV కార్లు అన్నీ మంచి సేల్స్ వృద్ధి సాధించాయి. ఈ విజయం, మా కార్లు ఎంత నాణ్యంగా ఉన్నాయో, మార్కెట్‌లో మాకు ఎంత ఆదరణ ఉందో తెలియజేస్తుంది. ఈ మంచి సేల్స్  మాకు ఈ ఆర్థిక సంవత్సరం మొత్తానికి ఒక మంచి ఆరంభాన్ని ఇచ్చాయని, రాబోయే కొత్త కార్ల లాంచ్‌లకు కూడా ఇదే ఉత్సాహాన్ని ఇస్తుందని నమ్ముతున్నాట్లు" చెప్పింది.