
టాటా మోటార్స్ తమ కమర్షియల్ వెహికల్స్ ధరలను జనవరి 1, 2024 నుంచి 3 శాతం వరకు పెంచనున్నట్లు ఆదివారం తెలిపింది. ఇన్‌పుట్ ఖర్చులు పెరగడమే ఈ నిర్ణయానికి కారణమంది. ఈ పెంపు కమర్షియల్ వెహికల్స్ అన్నింటికీ వర్తిస్తుందని టాటా మోటార్స్ ఒక ప్రకటనలో తెలిపింది. మారుతీ సుజుకీ, హ్యుందాయ్ మోటార్ ఇండియా, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, హోండా ఆడి వంటి ప్యాసింజర్ వాహన తయారీ సంస్థలు కూడా జనవరిలో ధరలను పెంచుతామని ప్రకటించాయి.