
పుణే : సోలార్ ప్రాజెక్టు కోసం టాటా మోటార్స్, టాటా పవర్ అనుబంధ సంస్థ టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ (టీపీఆర్ఈఎల్) పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ (పీపీఏ) కుదుర్చుకున్నాయి. టాటా మోటార్స్ పూణే ప్లాంటు వద్ద టీపీఆర్ఈఎల్ కొత్తగా 12 ఎండబ్ల్యూపీ (మెగావాట్పీక్) ఆన్-సైట్ సోలార్ ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేయనుంది.
ఇది ప్రతి సంవత్సరానికి 17.5 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుందని అంచనా. ఏడాది కరెంటు అవసరాల్లో ఇది 17.2 శాతం తీర్చుతుంది. ప్రతి సంవత్సరం 12400 టన్నులు/కిలోవాటర్ అవర్ కర్బన ఉద్గారాలను తగ్గించగలదు. ఈ సోలార్ ప్రాజెక్ట్ పీపీఏ సంతకం చేసిన తర్వాత ఆరు నెలల్లో ప్రారంభమవుతుంది.