ఈఎస్‌‌–టెక్‌‌ ను కొన్న టాటా టెక్నాలజీస్‌‌.. డీల్ విలువ రూ.775 కోట్లు.. !

ఈఎస్‌‌–టెక్‌‌ ను కొన్న టాటా టెక్నాలజీస్‌‌..  డీల్ విలువ రూ.775 కోట్లు.. !

న్యూఢిల్లీ: టాటా టెక్నాలజీస్ జర్మనీకి చెందిన ఈఎస్‌‌– టెక్‌‌ గ్రూప్‌‌,  దాని అనుబంధ సంస్థలలో 100శాతం వాటాను కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ ఒప్పందం విలువ 75 మిలియన్ యూరోలు (దాదాపు రూ.775 కోట్లు).  వచ్చే రెండేళ్లలో చెల్లింపులు జరుగుతాయి. ఈఎస్‌‌– టెక్‌‌ గ్రూప్‌‌ 2006లో ఏర్పాటైంది.  

ప్రీమియం ఆటోమోటివ్ ఇంజినీరింగ్ సేవలను అందిస్తోంది. ఏడీఏఎస్‌‌, కనెక్టెడ్‌‌ డ్రైవింగ్‌‌, డిజిటల్ ఇంజనీరింగ్‌‌  రంగాల్లో నైపుణ్యం కలిగి ఉంది. 300 మందికి పైగా నిపుణులు ఈ కంపెనీలో పనిచేస్తున్నారు. తాజా డీల్‌‌తో  టాటా టెక్నాలజీస్  గ్లోబల్‌‌గా విస్తరించడానికి వీలుంటుంది.