టాటా టిగోర్ ఈవీ ధర తగ్గిందోచ్..

టాటా టిగోర్ ఈవీ ధర తగ్గిందోచ్..

ఎలక్ట్రిక్ వాహనాలపై జీఎస్టీని 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించడంతో, ఆ ప్రయోజనాలను టాటా మోటార్స్ వినియోగదారులకు బదలాయిస్తోంది. టిగోర్ ఈవీ ధరను టాటా మోటార్స్ రూ.80 వేల వరకు తగ్గిస్తున్నట్టు కంపెనీ ఎలక్ట్రిక్ మొబిలిటీ బిజినెస్, కార్పొరేట్ స్ట్రాటజీ ప్రెసిడెంట్ శైలేష్ చంద్ర చెప్పారు. అంతకుముందు టిగోర్ ఈవీ ధర రూ.12.35 లక్షల నుంచి రూ.12.71 లక్షల మధ్యలో ఉండగా.. ధర తగ్గించిన తర్వాత ఇది రూ.11.58 లక్షల నుంచి రూ.11.92 లక్షలకు అందుబాటులోకి రానుంది.