ఐపీఎల్ రద్దుతో టీమిండియా ప్లేయర్లకు బెనిఫిట్

ఐపీఎల్ రద్దుతో టీమిండియా ప్లేయర్లకు బెనిఫిట్

ఐపీఎల్ పదమూడో సీజన్ రద్దవడం టీమిండియాకు సానుకూల అంశమని న్యూజిలాండ్ వెటరన్ బ్యాట్స్‌‌మన్ రాస్ టేలర్ అన్నాడు. మెగా టోర్నీ రద్దవడం వల్ల వరల్డ్ టెస్ట్ చాంపియన్‌‌షిప్ ఫైనల్‌‌ కోసం సన్నద్ధం అయ్యేందుకు టీమిండియాకు మరింత సమయం లభించిందన్నాడు. ఇంగ్లీష్ కండీషన్స్‌‌కు తగ్గట్లుగా ప్లేయర్లు మారేందుకు, అక్కడి వాతావరణ పరిస్థితులను అర్థం చేసుకునేందుకు చక్కటి అవకాశం వచ్చిందన్నాడు. ఐపీఎల్‌‌ను హఠాత్తుగా రద్దు చేయడం వెనుక భారత బోర్డు హస్తం ఉండొచ్చునేమోనన్నాడు. ఈ టోర్నీ రద్దయితే తమ బౌలర్లకు తిరిగి పుంజుకునేందుకు కాస్త విరామం దొరుకుతుంది కాబట్టి ఇలా చేసి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశాడు.