లాభాల్లోనూ TCS, ఇన్ఫోసిస్ పోటాపోటీ

లాభాల్లోనూ TCS, ఇన్ఫోసిస్ పోటాపోటీ

 మనదేశంలోనే అతిపెద్ద ఐటీ కంపెనీ టీసీఎస్‌ , మరో ఐటీ మేజర్ఇన్ఫోసిస్క్యూ 4 ఫలితాల్లో అదరగొట్టాయి. విశ్లేషకుల అంచనాలకు మించి టీసీఎస్‌ , ఇన్ఫోసిస్లాభాలు సంపాదించాయి. టీసీఎస్లాభం 10 శాతం పెరిగి రూ.8,126 కోట్లు గా నమోదయింది .ఇన్ఫోసిస్నికరలాభం 18 శాతం పెరిగి రూ.4,074 కోట్లుగా నమోదయింది . ఇన్ఫోసిస్రూ.10.50 చొప్పున, టీసీఎస్రూ.18చొప్పున ఒక్కో షేర్కు తుది డివిడెండ్ప్రకటించించాయి.

  • టీసీఎస్ లాభం రూ.8.126 కోట్లు
  • క్యూ4లో18 శాతం పెరుగుదల
  • గత క్యూలో
  • లాభం రూ.6,904 కోట్లు

18.5 శాతం పెరిగిన నికర అమ్మకాలు

మనదేశంలోనే అతిపెద్ద ఐటీకంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్ ) ఈ ఏడాది మార్చి 31తో ముగిసిన నాలుగో క్వా ర్టర్‌‌లో రూ.8,126 కోట్ల లాభంసం పాదించిం ది. 2018 క్యూ4 లాభంరూ.6,904 కోట్లతో పోలిస్తే ఇది 18 శాతంఅధికం. ఈసారి  లాభాలు రూ.6,904 కోట్లు నమోదవుతాయన్న విశ్లేషకుల అంచనాలకు మిం చిన ఫలితాలను టీసీఎస్‌‌ సాధించడంవిశేషం. నికర అమ్మకాలు రూ.32,075 కోట్లనుంచి రూ.38,010 కోట్లకు (18.5 శాతం)పెరిగాయి. గత 15 క్వా ర్టర్లలో ఇంత భారీ పెరుగుదల ఇదే తొలిసారని టీసీఎస్‌‌ సీఈఓ, ఎండీ రాజేశ్‌ గోపీనాథన్‌ అన్నారు. గత మూ డు క్వా ర్టర్ల కంటే ఈసారి ఆర్డర్‌‌ బుక్‌‌, డీల్స్ పటిష్టంగా ఉన్నాయని ప్రకటించారు. అయితే ఆపరేటింగ్‌ప్రాఫిట్ మార్జిన్‌ వార్షిక ప్రా తిపదికన 31 బేసిస్‌‌ పాయింట్లు తగ్గి 25.1 శాతంగా నమోదయింది. శుక్రవారం నాటి బోర్డు మీటింగ్‌ లో  షేరుకురూ.18 చొప్పున తుది డివిడెండ్‌ ను  ప్రకటించారు. ఇక ఇండస్ట్రీల్లో టీసీఎస్‌‌ బీఎఫ్‌‌ఎస్‌‌ఐ 11.6శాతం పెరుగుదల సాధించింది. క్యూ3లో ఇది 8.6 శాతం మాత్రమే నమోదయింది.లైఫ్‌‌ సైన్సెస్‌‌ అండ్‌ హెల్త్‌‌కేర్‌‌ విభాగంలో 18.2శాతం, ఎనర్జీ, యుటిలిటీస్‌‌లో 11.3 శాతం,కమ్యూనికేషన్స్‌‌, మీడియాలో 10 శాతం,రిటైల్‌ , సీపీజీలో 9.9 శాతం, మానుఫ్యాక్చరింగ్‌ లో 9.2 శాతం వృద్ధి నమోదయింది. టీసీఎస్క్యూ4లో కొత్తగా 6,356 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించిం ది.

ముఖ్యాంశాలు:

  • డాలర్ల వారీగా చూస్తే సంస్థ రెవెన్యూ 20 బిలి-యన్లు దాటింది. వార్షిక ప్రా తిపదికన 12.7శాతం, గత క్వా ర్టర్‌‌తో పోలిస్తే 2.4 శాతంపెరిగిం ది.
  • కంపెనీ ఈబీఐటీ రూ.9,537 కోట్లు కాగా,మార్జిన్లు 25.1 శాతం తగ్గాయి. అన్ని మేజర్‌‌ మార్కెట్లు అద్భుత ఫలితాలు రాబట్టాయి.ఇంగ్లం డ్‌ మార్కెట్‌ 21.3 శాతం, యూరప్‌17.5 శాతం, ఉత్తర అమెరి కా 9.9 శాతం,ఆసియా పసిఫిక్ మార్కెట్లు 11.5 శాతం,లాటిన్ అమెరికా మార్కెట్‌ 16.2 శాతం వృద్ధిసా ధించా యి.
  • 2019 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ మొత్తం 29,287 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించింది.

ఇన్ఫోసిస్ లాభం రూ..4074 కోట్లు

  • నికర లాభంలో 10 శాతం పెరుగుదల
  • 19 శాతం పెరిగిన రాబడులు
  • నిరాశపర్చిన వృద్ధి అంచనాలు

ఐటీ మేజర్‌‌‌‌ ఇన్ఫోసిస్‌‌‌‌ అంచనాలను అందుకుంది. గత నె ల 31న ముగిసిననాలుగో క్వా ర్టర్‌‌‌‌లో నికరలాభం 10 శాతంపెరిగి రూ.4,074 కోట్లుగా నమోదయింది.దలాల్‌ స్ట్రీట్‌ అంచనా రూ.3,956 కోట్ల కంటేఇది ఎక్కువే కావడం గమనార్హం. రాబడులు వార్షిక ప్రా తిపదికన 19.1 శాతం పెరిగిరూ.21,539 కోట్లకు, క్వా ర్టర్‌‌‌‌ ప్రా తిపదికనఅయితే 0.6 శాతం పెరిగాయి. గత క్యూ4తో(24.7 శాతం) పోలిస్తే ఈసారి మార్జిన్లు 21.5శాతానికి తగ్గాయి. మార్కెట్‌ లో ట్రేడిం గ్‌ జరుగుతున్న సమయంలోనే ఫలితాలను విడుదలచేశారు. దీంతో ఇన్ఫోసిస్‌‌‌‌ షేర్లు 0.50 శాతంపెరిగాయి. అయితే వృద్ధి అంచనాలు మాత్రం మార్కెట్‌ ను నిరాశపర్చాయి.

ఫలితాల ముఖ్యాంశాలు:

  • ఈ నెల ఒకటితో మొదలయ్యే ఆర్థిక సంవత్సరానికి కంపెనీ వృద్ధి అంచనాలు 7.5–9.5శాతం మధ్య ఉంటాయని పే ర్కొం ది. దలాల్‌స్ట్రీట్‌ అంచనా కంటే ఇవి చాలా తక్కువ.
  • నాలుగో క్వా ర్టర్‌‌‌‌ ఇన్ఫోసిస్‌‌‌‌ కరెన్సీ గ్రోత్‌ తొమ్మిదిశాతం నమోదయింది.
  • 2019 ఆర్థిక సంవత్సరానికి షేరుకురూ.10.50 చొప్పున తుది డివిడెండ్‌ చెల్లించాలని కంపెనీ బోర్డు సిఫార్సు చేసింది.
  • 2020 ఆర్థిక సంవత్సరానికి ఇన్ఫోసిస్‌‌‌‌ ఆపరేటింగ్‌ మార్జిన్‌ 21–23 శాతం మధ్య ఉంటుం దని అంచనా. 2019 ఆర్థిక సంవత్సరంలో ఆపరేటింగ్‌ మార్జిన్‌ 22.8 శాతం.డాలర్లలో లెక్కిస్తే ఇన్ఫోసిస్‌‌‌‌ రాబడులు క్యూ4లో 3.06 బిలియన్‌ డాలర్లుగా నమోదయింది. క్వార్టర్‌‌‌‌ వారీగా 2.4 శాతం, వార్షికప్రాతిపదికన 9.1 శాతం పెరిగింది. స్థిరమైనధరల వద్ద వార్షిక రె వెన్యూ వృద్ధి 11.7 శాతంనమోదయింది.
  • వరుసగా రెండో క్వా ర్టర్‌‌‌‌లోనూ కంపెనీ స్థిర మైన ధరల వద్ద రెం డంకెల వృద్ధిని సాధించడంవిశేషం.
  • క్యూ4లో డిజిటల్‌ రెవెన్యూ 1,035మిలియన్‌ డాలర్లకు (మొత్తం రె వెన్యూల్లో 33.8శాతం) చేరింది. వార్షిక ప్రాతిపదికన 41.1శాతం, గత క్వా ర్టర్‌‌‌‌తో పోలిస్తే ఈ క్వార్టర్‌‌‌‌లో వృద్ధి 9.7 శాతం నమోదయింది.
  • కంపెనీ అట్రిషన్‌ రేట్‌ (ఉద్యోగుల రాజీనామా-లు) మార్చ్‌‌‌‌ క్వా ర్టర్‌‌‌‌లో 20.4 శాతం ఉంది.దీనిని తగ్గిం చడానికి ప్రయత్నాలు చేస్తామని సీఓఓ ప్రవీణ్‌ రావు అన్నారు.