
న్యూఢిల్లీ: రూ. 10 లక్షల కంటే ఎక్కువ ధర ఉన్న హ్యాండ్‌బ్యాగులు, రిస్ట్‌వాచీలు, ఫుట్‌వేర్, స్పోర్ట్స్వేర్పై ఒక శాతం టీసీఎస్(ట్యాక్స్కలెక్టెడ్ఎట్సోర్స్) వసూలు చేస్తామని ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. రూ. 10 లక్షల కంటే ఎక్కువ ధర ఉన్న వెహికల్స్‌పై ఈ ఏడాది జనవరి నుంచే ఒకశాతం టీసీఎస్‌ను వసూలు చేస్తున్నారు. ఆదాయ పన్ను శాఖ ఏప్రిల్ 22న లగ్జరీ వస్తువుల వివరాలను జాబితాను నోటిఫై చేసింది.
వీటిలో రిస్ట్‌వాచీలు, పెయింటింగ్‌లు, శిల్పాలు, పురాతన వస్తువుల వంటి కళాఖండాలు, నాణేలు స్టాంపులు, యాట్లు, హెలికాప్టర్లు, లగ్జరీ హ్యాండ్‌బ్యాగులు, సన్ గ్లాసెస్, ఫుట్‌వేర్, హై-ఎండ్ స్పోర్ట్స్‌వేర్, ఎక్విప్మెంట్, హోమ్ థియేటర్ సిస్టమ్‌లు, రేసింగ్ లేదా పోలో కోసం వాడే గుర్రాలు వంటివి ఉన్నాయి. ఈ వస్తువులను విక్రయించే సమయంలో కొనుగోలుదారు నుంచి టీసీఎస్ వసూలు చేస్తారు.
ఐటీ రిటర్న్‌లను దాఖలు చేసే సమయంలో కొనుగోలుదారుడు తను కట్టే పన్ను మొత్తంలో సర్దుబాటు చేయవచ్చు. టీసీఎస్ వల్ల ప్రభుత్వానికి ఎటువంటి అదనపు ఆదాయం రాదు. కొనుగోలు సమయంలో పాన్‌కార్డు వివరాలను సమర్పించాల్సి ఉంటుంది కాబట్టి అధిక విలువ ఖర్చులను గుర్తించడం పన్ను శాఖకు వీలవుతుంది. టీసీఎస్‌ను వసూలు చేసే బాధ్యత అమ్మకందారుడిపైనే ఉంటుంది.