
సంచలన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ(Ram gopal varma) తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ వ్యూహం(Vyooham). గత నెల నవంబర్ 10న ప్రేక్షకుల ముందుకు రావాల్సిన వ్యూహాన్ని సెన్సార్ బోర్డు రిలీజ్ ను ఆపేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆర్జీవీ వెనక్కడుగు వేయకుండా..పట్టు వదలని విక్రమార్కుడిలా తన వ్యూహాలతో..ఎట్టకేలకు వ్యూహం రిలీజ్ డేట్ తీసుకొచ్చాడు. వ్యూహం మూవీ ఈ నెల డిసెంబర్ 29న థియేటర్లోకి వస్తోంది. ఇక సినిమా రిలీజ్ దగ్గర పడుతుండడంతో టీడీపీ కార్యకర్తలు హంగామా క్రియేట్ చేస్తున్నారు.
రాంగోపాల్ వర్మకు టిడిపి కార్యకర్తల మాస్ వార్నింగ్#ramgopalvarma@RGVzoomin#rgvzoomin@CinemaPosts#Vyooham pic.twitter.com/1RuxFCcpEW
— FILM JOURNALIST VENKAT (@CinemaPosts) December 25, 2023
ఈ సినిమాలో తీసుకున్న కంటెంట్..ప్రస్తుతం జరుగుతున్న అంశాలతో ఉండటం..ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకి పూర్తి విరుద్దంగా ఉండటంతో..RGV డెన్ ముందు టిడిపి కార్యకర్తల దౌర్జన్యం చేశారు. అలాగే డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ దిస్టి బొమ్మ దగ్ధం చేస్తూ..సినిమా రిలీజ్ ని ఆపేయాలంటూ నినాదాలు చేశారు. అంతేకాకుండా..నీకిష్టం వచ్చినట్లు సినిమాలు చేస్తే ఊరుకోము అంటూ వర్మపై ఫైర్ అయ్యారు.
Hey @ncbn , @naralokesh and @PawanKalyan , here are your DOGS BARKING outside my office and they RAN OFF when the COPS came pic.twitter.com/mOV4uM76IA
— Ram Gopal Varma (@RGVzoomin) December 25, 2023
చంద్రబాబు నాయుడు పైన గానీ, లోకేష్ పైన గానీ, పవన్ కళ్యాణ్ పైన గానీ కామెంట్స్ చేస్తే ఊరుకునేది లేదంటూ హెచ్చరిస్తున్నారు. ఇక పోలీసుల రాకతో అంతా క్లియర్ చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
దీనిపై వర్మ తనదైన యాంగిల్ లో స్పందిస్తూ..ఇదిగో చూడండీ..నా ఆఫీస్ బయట మీ కుక్కలు మొరుగుతున్నవి..ఒక్కసారిగా పోలీసులు రాగానే అవి పారిపోయాయి అంటూ..చంద్రబాబుని, నారా లోకేష్ని, పవన్ కళ్యాణ్ను ట్యాగ్ చేస్తూ..వర్మ ట్వీట్ చేశారు.