AP Politics : టీడీపీ, జనసేన ఫస్ట్ లిస్ట్.. నియోజకవర్గాలు, అభ్యర్థులు వీరే..

AP Politics : టీడీపీ, జనసేన ఫస్ట్ లిస్ట్..  నియోజకవర్గాలు, అభ్యర్థులు వీరే..

2024 ఎన్నికల్లో అధికార వైఎస్సార్సీపీని గద్దె దించటమే లక్ష్యంగా పొత్తు కుదుర్చుకున్న టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థుల జాబితాను ప్రకటించాయి. పార్టీ శ్రేణులతో సహా సామాన్యులు కూడా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూసిన అభ్యర్థుల జాబితా రానే వచ్చింది. ఉండవల్లిలో చంద్రబాబు నివాసంలో భేటీ అయ్యి అభ్యర్థుల జాబితాపై కసరత్తు జరిపిన తర్వాత తొలి జాబితాను ప్రకటించారు. తోలి జాబితాలో 118సీట్లకు ఉమ్మడి అభ్యర్థులను ప్రకటించారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్. ఇందులో 94స్థానాల్లో, జనసేన 24 సీట్లలో పోటీ చేయనున్నట్లు తెలిపారు.

పార్లమెంట్ ఎన్నికల్లో జనసేన 3ఎంపీ స్థానాల్లో పోటీ చేయనుండగా మిగతా స్థానాల్లో టీడీపీ పోటీ చేయనుందని ప్రకటించారు. బీజేపీతో పొత్తుపై ఓ నిర్ణయానికి వచ్చాక తరవాతి జాబితాను ప్రకటిస్తామని తెలిపారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఓట్లు చీలకూడదనే సదుద్దేశంతోనే సీట్లు కుదించుకొని 24స్థానాలకే పరిమితం అయ్యామని పవన్ కళ్యాణ్ అన్నాడు.

తక్కువ స్థానాల్లో పోటీ చేస్తున్నందుకు జనసేన శ్రేణులు నిరాశకు గురి కాకూడదని, ప్రభుత్వం స్థాపించక అందరికీ తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వాన్ని దించటమే ఈ కూటమి లక్ష్యమని, కచ్చితంగా జనసేన ఓట్ టీడీపీకి ట్రాన్స్ఫర్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు.

జనసేన అభ్యర్థుల జాబితా: 

నెల్లిమర్ల : లోకం మాధవి
అనకాపల్లి : కొణతాల రామకృష్ణ
రాజానగరం : బత్తుల రామకృష్ణ
కాకినాడ రూరల్ : పంతం నానాజీ
తెనాలి : నాదెండ్ల మనోహర్ 

టీడీపీ అభ్యర్థుల జాబితా:

ఆముదావలస - కూన రవికుమార్
ఇచ్ఛాపురం - బెందాలం అశోక్
టెక్కలి - అచ్చెన్నాయుడు
రాజాం - కొండ్రు మురళీమోహన్
అరకు - దొన్ను దొర
సాలూరు - గుమ్మడి సంధ్యా రాణి
అనకాపల్లి - పీలా గోవింద్
నర్సీపట్నం - అయ్యన్నపాత్రుడు
విశాఖ ఈస్ట్ - వెలగపూడి రామకృష్ణ బాబు
విశాఖ వెస్ట్ - గణ బాబు
కొత్తపేట - బండారు సత్యానందరావు
మండపేట - జోగేశ్వర రావు
జగ్గంపేట - జ్యోతుల నెహ్రూ
పెద్దాపురం - చిన రాజప్ప
తుని - యనమల దివ్య
అనపర్తి - నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి
రాజమండ్రి సిటీ - ఆదిరెడ్డి శ్రీనివాస్
పాలకొల్లు - నిమ్మల రామానాయుడు
ఆచంట - పితాని సత్యనారాయణ
తణుకు - అరిమిల్లి రాధాకృష్ణ
ఉండి - మంతెన రామరాజు
చింతలపూడి - సొంగా రోషన్
దెందులూరు - చింతమనేని ప్రభాకర్
ఏలూరు - బడేటి రాధాకృష్ణ
గన్నవరం - యార్లగడ్డ వెంకట్రావు
గుడివాడ - వెనిగండ్ల రాము
మచిలీపట్నం - కొల్లు రవీంద్ర
జగ్గయ్యపేట - శ్రీరామ్ తాతయ్య
తిరువూరు - కోలికపూడి శ్రీనివాస్
నందిగామ - తంగిరాల సౌమ్య
విజయవాడ సెంట్రల్ - బోండా ఉమామహేశ్వర రావు
విజయవాడ ఈస్ట్ - గద్దె రామ్మోహన్
మంగళగిరి - నారా లోకేష్
పొన్నూరు - ధూళిపాళ్ల నరేంద్ర
ప్రత్తిపాడు - బి.రామాంజనేయులు
తాడికొండ - తెనాలి శ్రావణ్ కుమార్
చిలకలూరిపేట - ప్రత్తిపాటి పుల్లారావు
మాచర్ల - జూలకంటి బ్రహ్మానంద రెడ్డి
సత్తెనపల్లి - కన్నా లక్ష్మీనారాయణ
రేపల్లె - అనగాని సత్యప్రసాద్
వేమూరు - నక్కా ఆనంద్ బాబు
అద్దంకి - గొట్టిపాటి రవికుమార్
పర్చూరు - ఏలూరి సాంబశివ రావు
కనిగిరి - ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి
కొండెపి - డోలా బాల వీరాంజనేయులు
ఒంగోలు - దామచర్ల జనార్దన్
ఎర్రగొండపాలెం - ఎరిక్సన్ బాబు
మార్కాపురం - కందుల నారాయణ రెడ్డి
నెల్లూరు సిటీ - పొంగూరు నారాయణ
నెల్లూరు రూరల్ - కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
సర్వేపల్లి - సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
ఆత్మకూరు - ఆనం రామనారాయణ రెడ్డి
గూడూరు - పాశం సునీల్
కుప్పం - నారా చంద్రబాబు నాయుడు
నగరి - గాలి భాను ప్రకాష్
పలమనేరు - అమర్నాథ రెడ్డి
హిందూపురం - బాలకృష్ణ
తాడిపత్రి - జేసీ అస్మిత్ రెడ్డి 
రాప్తాడు - పరిటాల సునీత
ఉరవకొండ - పయ్యావుల కేశవ్
కడప - రెడ్డప్పగారి మాధవి
పులివెందుల - బీటెక్ రవి
మైదుకూరు - పుట్టా సుధాకర్ యాదవ్
కర్నూలు - టీజీ భరత్
నంద్యాల - NMD ఫరూక్
పాణ్యం - గౌరు చరితా రెడ్డి
పత్తికొండ - కేఈ శ్యాం
ఆళ్లగడ్డ - భూమా అఖిలప్రియ