‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ నిలిపేయండి : ఈసీకి టీడీపీ ఫిర్యాదు

‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ నిలిపేయండి : ఈసీకి టీడీపీ ఫిర్యాదు

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ సినిమా విడుదల కాకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ ఎన్నికల సంఘాన్ని కోరింది తెలుగుదేశం పార్టీ. టీడీపీ నాయకుడు దేవిబాబు చౌదరి ఎన్నికల కమిషన్‌ ను కలిసి లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాపై ఫిర్యాదు చేశారు. ఈ చిత్రం రాబోయే ఎన్నికలపై ప్రభావం చూపుతుందని…  సినిమాలో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు పాత్రను ఉద్దేశపూర్వకంగా నెగెటివ్‌ గా చూపించారని అన్నారు. ఫస్ట్ ఫేజ్ పోలింగ్ ఏప్రిల్ 11న జరగనుండటంతో.. అప్పటివరకు ఈ సినిమా విడుదల కాకుండా ఆపాలని ఈసీని కోరారు టీడీపీ నేతలు.

సినిమా విడుదల ఆపేందుకు టీడీపీ చేస్తున్న ప్రయత్నాలపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. నరకం నుంచి కూడా నిజాన్ని ఎవరూ ఆపలేరని … ఈ సినిమాను ఆపాలనుకుంటున్నవాళ్లు తెల్సుకుంటే మంచిదని అన్నారు. చంద్రబాబును నెగెటివ్ గా చూపించానని అనుకుంటున్న వాళ్లు కూడా నిజం తెల్సుకోవాలన్నారు. తనను చంపినా కూడా లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదలవుతుందని చెప్పారు వర్మ. మార్చి 22న లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదలవుతుందని ఇప్పటికే ప్రకటించారు.