రేపు (11వ తేదీ) ఏపీ బంద్ కు టీడీపీ పిలుపు

రేపు (11వ తేదీ) ఏపీ బంద్ కు టీడీపీ పిలుపు

టీడీపీ అధినేత చంద్రబాబు రిమాండ్ కు నిరసనగా రేపు (సెప్టెంబర్ 11) ఏపీ  బంద్ కు  టీడీపీ పిలుపునిచ్చింది. రాజకీయ కక్ష సాధింపుతో చేసిన అరెస్టును బంద్ ద్వారా ప్రతి ఒక్కరూ ఖండించాలని కోరింది. ప్రజా సమస్యలపై పోరాడుతున్న తమ అధినేత గొంతు నొక్కేందుకే ఇలా చేశారని టీడీపీ నేతలు ధ్వజమెత్తారు. ఎమర్జెన్సీ సేవల్లోని వారు మినహా మిగతా వర్గాలు అన్నీ బంద్ కు సహకరించాలని నేతలు కోరారు.  

ALSOREAD: చంద్రబాబుకు 14 రోజుల రిమాండ్.. రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలింపు

మరో వైపు రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేయాలంటూ  అన్ని జిల్లాల ఎస్పీలకు డీజీపీ ఆదేశాలు జారీ చేశారు.  అనుమతి లేకుండా ర్యాలీలు, సభలు నిర్వహించకూడదని హెచ్చరించారు.

 స్కిల్ డెవ్ లప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబుకు విజయవాడ ఏసీబీ కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. దీంతో చంద్రబాబు  సెప్టెంబర్ 22 వరకు రిమాండ్ లో ఉండనున్నారు.