ఎట్టకేలకు పొత్తు కుదిరింది.. సీట్ల లెక్క తేలింది..

ఎట్టకేలకు పొత్తు కుదిరింది.. సీట్ల లెక్క తేలింది..

టీడీపీ, జనసేన, బీజేపీల పొత్తు ఉంటుందా లేదా అన్న సస్పెన్స్ కు ఎట్టకేలకు ఎండ్ కార్డు పడింది. ఢిల్లీలో రెండురోజుల పాటు సుదీర్ఘ పడిగాపుల తర్వాత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లకు అమిత్ షా అపాయింట్మెంట్ ఇచ్చాడు. ఈ భేటీలో సీట్ల పంపకం అంశం కొలిక్కి వచ్చింది. పొత్తులో భాగంగా బీజేపీ, జనసేనలకు 30 అసెంబ్లీ స్థానాలు కేటాయించేందుకు బాబు ఒప్పుకున్నాడని సమాచారం అందుతోంది. బీజేపీకి 5 లేదా 6 ఎంపీ సీట్లు కేటాయించనున్నట్లు సమాచారం.

అరకు, నర్సాపురం, రాజమండ్రి, తిరుపతి, రాజంపేట ఎంపీ స్థానాల్లో బీజేపీ పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. జనసేన, బీజేపీలకు 8 ఎంపీ స్థానాలు కేటాయించనున్నారని సమాచారం అందుతోంది. సుమారు గంట పాటు జరిగిన ఈ సమావేశంలో అమిత్ షా, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లతో పాటు జేపీ నడ్డా కూడా పాల్గొన్నాడు.బీజేపీతో పొత్తు అంశం కొలిక్కి వచ్చిన నేపథ్యంలో త్వరలోనే టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థుల ఉమ్మడి జాబితా ప్రకటించే అవకాశం ఉంది. మరి, జనసేన, బీజేపీ మధ్య ఏ రకంగా సీట్ల సర్దుబాటు జరుగుతుందో వేచి చూడాలి.