చిత్తూరు జిల్లాలో కొనసాగుతున్న ‘యువగళం’ పాదయాత్రలో వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వంపై టీడీపీ యువనేత నారా లోకేష్ నిప్పులు చెరిగారు. మీసం మెలేసి మరీ జగన్ సర్కార్ కు సవాల్ విసిరారు. తమను, తమ పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారంటూ మండిపడ్డారు. ‘గన్నవరంలో టీడీపీ ఆఫీసు తగలబెడితో నో కేసు.. నేను స్టూలు ఎక్కి మాట్లాడితే కేసు. నాపై దాడికి వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు కత్తులు, కర్రలతో వస్తే నో కేసు. నేను మాట్లాడితే కేసు. చంద్రబాబు ఒక్క చిటికేస్తే చాలు..మీసం మెలేసి చెబుతున్న..ఒక్కొక్కడికీ పగిలిపోద్ది. తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, ఆఫీసులపై దాడి చేసిన వాళ్లను నడిరోడ్డుపై ఊరేగిస్తాం’ అంటూ నారా లోకేష్ వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతం నారా లోకేష్ ‘యువగళం’ పాదయాత్ర చిత్తూరు జిల్లాలో కొనసాగుతోంది. పాదయాత్రలో ప్రజా సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు.
