అర్థమయ్యేలా పాఠాలు చెప్పాలి: కలెక్టర్ కోయ శ్రీ హర్ష

అర్థమయ్యేలా పాఠాలు చెప్పాలి: కలెక్టర్ కోయ శ్రీ హర్ష

ఊట్కూర్/నర్వ వెలుగు:  బేస్ లైన్ టెస్ట్ తో విద్యార్థుల అభ్యాసనా సామర్థాన్ని అంచనా వేయాలని నారాయణపేట కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు.  వారిని సామర్థ్యాల వారీగా విభజించి వర్క్ బుక్ ద్వారా విద్యార్థులకు నేర్పించాలన్నారు. గురువారం ఊట్కూర్, నర్వ మండలాల్లో అదనపు కలెక్టర్ మయాంక్ మిత్తల్ తో కలిసి  పర్యటించారు. ఊట్కూర్ మండలంలో ని లక్ష్మిపల్లి ,మోగ్దుం పూర్ లోని స్కూల్స్​ను, పులిమమిడి కేబీజీవీని, పీహెచ్​సీని, అంగన్ వాడీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. పీహెచ్​సీ ప్రహరీ  పనులను త్వరగా పూర్తిచేసి రోగులకు మెరుగైన వైద్యాన్ని అందించాలన్నారు.

  హరితహరం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. పథర్ చేడ్ జీపీ  నుంచి నర్వ మండలానికి వెళ్లే  రహదారికి ఇరువైపులా పూలు, పండ్లు, నీడనిచ్చే మొక్కలను నాటాలని అధికారులను ఆదేశించారు. అనంతరం పథర్ చేడ్  గ్రామంలో స్కూల్ లో  విద్యార్థులతో ముచ్చటించారు.  45రోజుల కార్యాచరణ ప్రణాళికలో విద్యార్థులకు వారికి అర్థం అయ్యే విధంగా భోదించాలని టీచర్స్​కు సూచించారు కార్యక్రమంలో  ఎంపీడీవో తదితరులు ఉన్నారు.