- స్ట్రెంత్ పెంచేలా కృషి చేసిన టీచర్‌ను సన్మానించిన స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్
లక్సెట్టిపేట, వెలుగు: లక్సెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని ముల్కల్లగూడ ఎంపీపీ స్కూల్లో విద్యార్థుల సంఖ్యను జీరో నుంచి 110 మందిని పెంచినందుకు ఆ స్కూల్ టీచర్దిలీప్ కుమార్‌ను రాష్ట్ర పాఠశాల విద్యా సంచాలకుడు డాక్టర్ నవీన్ నికోలస్ సన్మానించి ప్రశంసాపత్రం అందజేశారు. 2024లో దిలీప్ కుమార్‌కు ఈ స్కూల్లో పోస్టింగ్ ఇచ్చినప్పుడు ఒక్క విద్యార్థి కూడా లేడు.
బడిబాట కార్యక్రమం ద్వారా ఆయన ఇంటింటికీ తిరిగి తల్లిదండ్రులను ఒప్పించి విద్యార్థులను స్కూల్లో చేర్పించారు. ఆయన కృషితో ఒక్క ఏడాదిలోనే విద్యార్థుల సంఖ్య 110కు చేరింది. దీంతో మంగళవారం హైదరాబాద్‌లోని స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయంలో దిలీప్‌ను నవీన్ నికోలస్అభినందించారు.
