
డీఎస్సీ మోడల్ స్కూల్స్ టీచర్ పోస్టుల నోటిఫికేషన్స్ పై అభ్యర్థుల ఆశలు పెట్టుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో మరియు మోడల్ స్కూల్స్ లో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ కోసం లక్షలాది మంది అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తర్వాత 11062 టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసి పరీక్షల నిర్వహణ నియామక ప్రక్రియ త్వరగా పూర్తి చేశారు. అందుకు నిరుద్యోగులు ఈ ప్రభుత్వాన్ని ప్రశంసిస్తున్నారు. అలాగే, ఇపుడు మరో డీఎస్సీ తో పాటు, మోడల్ స్కూల్స్ పోస్టులు భర్తీ చేస్తారనే విశ్వాసంతో అభ్యర్థులు ఉన్నారు.
గత ఏడాది డీఎస్సీ నిర్వహణ సమయంలోనే మరో 5 వేల టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని జాబ్ క్యాలండర్ ఇస్తామని పేర్కొన్నారు. వివిధ రకాల సమస్యల వల్ల జాబ్ క్యాలండర్ వాయిదాపడిన విషయం తెలిసిందే. గత డీఎస్సీ పరీక్షలు జరిగి దాదాపు సంవత్సరం అవుతోంది. కాబట్టి పదవీ విరమణ ద్వారా ఏర్పడిన ఖాళీలు క్లియర్ వేకెన్సీలతో కలిపి దాదాపు 10 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. టెట్ పరీక్షలు కూడా పూర్తి కాబోతున్నాయి. కాబట్టి త్వరగా డీఎస్సీపై నిర్ణయం తీసుకోవాలని అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. అలాగే ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో జరిగిన మోడల్ స్కూల్ ఖాళీల భర్తీ తర్వాత ఇంతవరకు మళ్ళీ నోటిఫికేషన్ జారీ కాలేదు. మోడల్ స్కూల్స్లో ప్రమోషన్స్ ప్రక్రియ బదిలీల ప్రక్రియ త్వరలో పూర్తి అయ్యే అవకాశం ఉంది. కాబట్టి దాదాపు 2 వేల టీచర్ పోస్టులు ఖాళీలు ఉండే అవకాశం ఉంది. డీఎస్సీతో పాటు మోడల్ స్కూల్స్ ఖాళీలకు నోటిఫికేషన్స్ ఇస్తే ఇటు నిరుద్యోగులకు న్యాయంతో పాటు, అటు ప్రభుత్వ పాఠశాలల మోడల్ స్కూల్స్ విద్యార్థులకు మరింత మంది టీచర్లు అందుబాటులోకి వస్తారు. కాబట్టి ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని అభ్యర్థులు ఆశిస్తున్నారు.
- రావుల రామ్మోహన్ రెడ్డి