
మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల నందగో పాలం టీమ్ గవర్నమెంట్ టీచర్లు మంగళవారం లక్సెట్టిపేట మండలం జెండావెంకటపూర్ పంచాయతీ పరిధిలోని చెల్లంపేట, తలమల, మన్నెగూడలో గిరిజన విద్యార్థులకు బుక్స్, డ్రెస్లు అందజేశారు. టీమ్ లీడర్ కుర్మా సునీత, సభ్యులు కొండ్ర సునీత, బద్రి శ్రీదేవి, టి.సుజాత, అనిత, సత్య పాల్గొన్నారు.
స్కూల్ కిట్ల అందజేత
బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో హాజీపూర్ మండలం సబ్బెపల్లి, దొనబండ జడ్పీ హైస్కూల్ టెన్త్ క్లాస్స్టూడెంట్లకు స్కూల్ కిట్లు అందజేశారు. బాగా చదువుకొని తల్లిదండ్రుల కలలను నెరవేర్చాలని విద్యార్థులకు రఘునాథ్ రావు సూచించారు.