
నస్పూర్, వెలుగు: మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా టీచర్లు నూతన విద్యావిధానంపై దృష్టిపెట్టాలని ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్‌రెడ్డి సూచించారు. టీచర్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ట్రస్మా ఆధ్వర్యంలో బుధవారం నస్పూర్ పట్టణంలోని ఓ ఫంక్షన్హాల్లో మంచిర్యాల జిల్లాకు చెందిన ఉత్తమ టీచర్లను సన్మానించారు. కార్యక్రమంలో పాల్గొన్న నరేందర్‌రెడ్డి, ఎంఈవో పద్మజ, ట్రస్మా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మలేత్తుల రాజేంద్రపాణి, జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ తదితరులు పాల్గొని డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఫొటోకు పూలమాలలేసి నివాళులర్పించారు.
నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఆర్టిఫిషిల్ ఇంటిలిజెన్స్ కాలంలో సెలబస్ కొత్త పుంతలు తొక్కుతోందని, ఇందుకు అనుగుణంగా విద్యా బోధనలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. 2027–28లో రాష్ట్రంలో కొత్త విద్యా పాలసీ రాబోతోందని, విద్యా విధానంలో అనేక మార్పులు వెనుకబడిన విద్యార్థులపై టీచర్లు ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు. పిల్లలకు అర్థమయ్యేలా పాఠాలు బోధించాలని సూచించారు.
ఉపాధ్యాయులకు సబ్జెక్టుల వారీగా మోటివేషన్, ఓరియంటేషన్ క్లాసులను త్వరలోనే ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ట్రస్మా నాయకులు శ్యాంసుందర్ రెడ్డి, రజనీ, రేగళ్ల ఉపేందర్, మైదం రామకృష్ణ, ఊట్ల సత్యనారాయణ, అంబాల రాజ్‌కుమార్, పెట్టం మల్లయ్య, బత్తిని దేవన్న, కృష్ణారెడ్డి, అంబాల రాజ్‌కుమార్, అమన్ ప్రసాద్, సమ్మిరెడ్డి, మమత, జిల్లాలోని పలు స్కూళ్ల కరస్పాండెంట్లు, ప్రిన్సిపాల్స్, టీచర్లు, ట్రస్మా ప్రతినిధులు పాల్గొన్నారు.